AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Collection: ఆర్థిక రంగంలో ప్రభుత్వానికి శుభవార్త! రానున్న నెలల్లో పెరగనున్న ఆదాయపు పన్ను వసూళ్లు

Tax Collection: ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి ట్రెండ్ రానున్న నెలల్లో కూడా కొనసాగుతుందని అంచనా. ఎందుకంటే పండుగల సీజన్‌లో మరింతగా మెరుగుపడనుంది. కార్పొరేట్ లాభాలు..

Tax Collection: ఆర్థిక రంగంలో ప్రభుత్వానికి శుభవార్త! రానున్న నెలల్లో పెరగనున్న ఆదాయపు పన్ను వసూళ్లు
Income Tax
Subhash Goud
|

Updated on: Sep 25, 2022 | 8:47 PM

Share

Tax Collection: ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ధి ట్రెండ్ రానున్న నెలల్లో కూడా కొనసాగుతుందని అంచనా. ఎందుకంటే పండుగల సీజన్‌లో మరింతగా మెరుగుపడనుంది. కార్పొరేట్ లాభాలు, వ్యాపారం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు పెరిగాయి. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 30 శాతం పెరిగి రూ.8.36 లక్షల కోట్లకు చేరాయి.

కార్పొరేట్ పన్ను రిటర్న్ సంఖ్యలు తగ్గాయి:

త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్ పన్ను రిటర్న్‌లు ఇంకా దాఖలు కాలేదు. కానీ ముందస్తు పన్ను వసూళ్లలో బలమైన ధోరణి వసూళ్ల పెరుగుదలను సూచిస్తుంది. కార్పోరేట్ రంగం లాభదాయకమైన వృద్ధిని పుంజుకుందని నిపుణులు అంటున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధి, పన్ను పరిపాలన పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం నిరంతరం పన్ను నెట్‌లోకి వస్తోందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 1, సెప్టెంబర్ 17 మధ్య వచ్చిన రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను రూ.4.36 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం నుంచి రూ.1.35 లక్షల కోట్ల రీఫండ్‌లను తీసివేసినా, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23 శాతం వృద్ధితో రూ.7 లక్షల కోట్లుగా ఉన్నాయి.

నిపుణులు ఏమంటారు?

శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కో పార్టనర్‌ అమిత్‌ సింఘానియా మాట్లాడుతూ.. రానున్న పండుగల సీజన్‌ను చూస్తుంటే పన్నుల వసూళ్ల జోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. క్రిప్టో ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందని, పన్ను స్థావరాన్ని విస్తృతం చేశామని, ఫలితంగా పన్ను వసూళ్లు పెరిగాయని AMRG & అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఇంకా మహమ్మారికి ముందు స్థాయికి చేరుకోలేదు. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గించగలదు. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో ఈ విషయాన్ని అంచనా వేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి