Gold, Silver Price Today: మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం.. మరి వెండి ధర ఎంతంటే..!

Gold, Silver Price Today: దేశంలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా దేశంలో సెప్టెంబర్‌ 26 (సోమవారం)..

Gold, Silver Price Today: మహిళలకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం.. మరి వెండి ధర ఎంతంటే..!
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Sep 26, 2022 | 6:23 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. తాజాగా దేశంలో సెప్టెంబర్‌ 26 (సోమవారం) బంగారం ధర పెరిగింది. అయితే 22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా, 24 క్యారెట్ల బంగారంపై మాత్రం భారీగా పెరిగింది. తులం పసిడిపై ఏకంగా రూ.1800 వరకు ఏగబాకింది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. అయితే రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం ధర పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ తెలంగాణలోని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,000 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉంది.

☛ తమిళనాడులోని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద ఉంది.

☛ మహారాష్ట్రలోని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 వద్ద ఉంది.

☛ పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉంది.

☛ కర్ణాటకలోని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక దేశంలో పసిడి ధర పెరిగితే వెండి మాత్రం నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,800 ఉండగా, విజయవాడలో రూ.61,500 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.61,500 ఉండగా, ముంబైలో రూ.56,300 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.56,300 ఉండగా, కోల్‌కతాలో రూ.56,300 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,500 ఉండగా, కేరళలో రూ.61,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి