Penalty: బుక్‌ చేసుకున్న ప్లాట్‌ ఇవ్వడంలో ఆలస్యం.. రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ.16 లక్షల జరిమానా

ఇల్లు కొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈ వార్తపై శ్రద్ధ పెట్టాల్సిందే. చాలా మంది ఫ్లాట్ బుక్ చేసుకుని చేతికి అందకుండా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందర్భాలున్నాయి. బిల్డర్లు ఇచ్చిన తేదీ కంటే ఇల్లు చాలా సంవత్సరాలు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భంలో వినియోగదారుడు పరిహారం పొందేందుకు వీలు కల్పించే చట్టం కూడా..

Penalty: బుక్‌ చేసుకున్న ప్లాట్‌ ఇవ్వడంలో ఆలస్యం.. రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ.16 లక్షల జరిమానా
Homebuyer
Follow us
Subhash Goud

|

Updated on: Jun 22, 2023 | 4:28 PM

ఇల్లు కొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈ వార్తపై శ్రద్ధ పెట్టాల్సిందే. చాలా మంది ఫ్లాట్ బుక్ చేసుకుని చేతికి అందకుండా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందర్భాలున్నాయి. బిల్డర్లు ఇచ్చిన తేదీ కంటే ఇల్లు చాలా సంవత్సరాలు ఆలస్యం కావచ్చు. అటువంటి సందర్భంలో వినియోగదారుడు పరిహారం పొందేందుకు వీలు కల్పించే చట్టం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటువంటి సంఘటన జరిగింది. ఒక కస్టమర్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి 16 లక్షల రూపాయల పరిహారం పొందాడు. నోయిడాలోని అపార్ట్‌మెంట్ నిర్మాణ ప్రాజెక్ట్ ప్రమోటర్ కంపెనీ అయిన నెక్స్‌జెన్ ఇన్‌ఫ్రాకాన్ 3 సంవత్సరాలు ఆలస్యంగా కస్టమర్‌కు ఫ్లాట్‌ను అప్పగించింది. దీనిని ప్రశ్నిస్తూ వినియోగదారుడు ఉత్తరప్రదేశ్‌లోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)ని సంప్రదించారు. ఈ కేసును విచారించిన రెరా కోర్టు వినియోగదారునికి రూ.16 లక్షల పరిహారం చెల్లించాలని ప్రమోటర్ కంపెనీని ఆదేశించింది.

2017లో ఈ వ్యక్తి 1.35 కోట్లు చెల్లించి ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. డిసెంబర్ 2018 నెలలో ఫ్లాట్‌ను అప్పగిస్తామని ప్రమోటర్ కంపెనీ తెలిపింది. అయితే , రెండేళ్ల తర్వాత కూడా అతనికి ఫ్లాట్ లభించకపోవడంతో కస్టమర్ 2021 లో రెరాకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఫ్లాట్ అప్పగిస్తామని చెప్పారు. అయితే ఫ్లాట్‌ను 2018 లో అప్పగించాల్సి ఉన్నందున రెరా కోర్టు కేసును విచారించి వినియోగదారునికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

వినియోగదారుడు చెల్లించిన మొత్తానికి 2018 నుంచి వడ్డీని లెక్కించి 16 లక్షల రూపాయలు చెల్లించాలని నెక్స్‌జెన్ ఇన్‌ఫ్రాకాన్‌ను కోర్టు ఆదేశించింది. రెరా చట్టం నియమం ప్రకారం.. వడ్డీ ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఆధారంగా లెక్కించబడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..