LIC Dhan Sanchay Policy: సింగిల్ పాలసీ.. బహుళ ప్రయోజనాలు.. దీని గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు..
ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ కూడా ఒకటి. ఇది బీమా కవరేజీని అందించడంతో పాటు భవిష్యత్ ఆదాయ వనరులను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ధన సంచయ్ పాలసీ అంటే ఏమిటి? దానిలో ఉండే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం..
ప్రజల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటే అపారమైన నమ్మకం. ప్రభుత్వ మద్దతుతో కూడిన సంస్థ కావడంతో అందరూ దీనిలో విరివిగా పెట్టుబడులు పెడతారు. ఎల్ఐసీ కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక రకాల పాలసీలు తీసుకొస్తుంటుంది. అందులో ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ కూడా ఒకటి. ఇది బీమా కవరేజీని అందించడంతో పాటు భవిష్యత్ ఆదాయ వనరులను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ధన సంచయ్ పాలసీ అంటే ఏమిటి? దానిలో ఉండే ప్రయోజనాలు ఏమిటి? ప్రీమియం ఎలా ఉంటుంది? అర్హతలు ఏమిటి తెలుసుకుందాం..
ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ..
ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో ఈ ప్రత్యేక ప్లాన్ నామినీకి ఆర్థిక రక్షణను అందిస్తుంది. అంతేకాక ఈ ప్లాన్ మెచ్యూరిటీ తేదీ నుంచి చెల్లింపు వ్యవధిలో పాలసీదారులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. మీరు అధికారిక ఎల్ఐసీ వెబ్‌సైట్ నేరుగా సందర్శించడం ద్వారా లేదా ఏజెంట్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనిలో మెచ్యూరిటీ ప్రయోజనాలు, మరణప్రయోజనాలు, పాలసీ చెల్లింపు వ్యవధిలో స్థిరమైన ఆదాయం అందుతుంది. డెత్ కవరేజీని నామినీ ఏకమొత్తంలో ఒకేసారి పొందవచ్చు. లేదా ఐదేళ్లలో వాయిదాల పద్ధతిలో కూడా పొందవచ్చు. ఈ విషయాన్ని పాలసీదారులు పాలసీ తీసుకొనేటప్పుడే ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు ఇవి..
ఎల్ఐసీ ధన్ సంచయ్ ప్లాన్ కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్ల టర్మ్‌తో లభిస్తుంది. లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇంక్రీసింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ బెనిఫిట్ పేరుతో నాలుగు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీడ్ ఇన్‌కమ్ బెనిఫిట్, గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న కాలంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. డెత్ బెనిఫిట్ కూడా ఒకేసారి పొందొచ్చు. లేదా ఐదేళ్లపాటు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందొచ్చు. పాలసీ తీసుకునే సమయంలోనే ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
పాలసీదారు మెచ్యూరిటీ తేదీ నాటికి జీవించి ఉన్నట్లయితే, మెచ్యూరిటీ ప్రయోజనాన్ని గ్యారెంటీడ్ ఇన్‌కమ్ బెనిఫిట్, గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్‌గా పొందవచ్చు. చెల్లింపు వ్యవధిలో పాలసీదారు మరణించినట్లయితే, నామినీ గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్‌తో పాటు మిగిలిన చెల్లింపు వ్యవధికి వర్తించే చెల్లింపు మోడ్‌కు అనుగుణంగా గ్యారెంటీడ్ ఇన్‌కమ్ బెనిఫిట్‌ను అందుకోవడం కొనసాగుతుంది. ప్రమాదం కారణంగా బీమా చేసిన వ్యక్తి మరణం సంభవించినట్లయితే, నామినీ మొత్తం హామీ మొత్తాన్ని అలాగే రైడర్ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఈ ప్లాన్ యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, ప్రమాదంలో వైకల్యానికి దారితీసినట్లయితే ఎల్ఐసీ రైడర్ ప్రయోజనాలను 10 సంవత్సరాలలో వాయిదాల రూపంలో చెల్లిస్తుంది.
పాలసీ టర్మ్..
లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇన్‌క్రెసింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్ కోసం పాలసీదారులు 10, 15 సంవత్సరాల టర్మ్ ని ఎంచుకోవచ్చు. లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్‌తో సింగిల్ ప్రీమియం లెవల్ ఇన్‌కమ్ బెనిఫిట్ , సింగిల్ ప్రీమియం మెరుగుపరచబడిన కవర్ కోసం పాలసీ టర్మ్ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటుంది. ధన్ సంచయ్ ప్లాన్ ప్రారంభించడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..