LIC Claim Settlement: ఒడిశా రైలు ప్రమాదం బాధితులకు ఎల్‌ఐసీ పరిహారం.. ఎలా పొందాలో తెలుసుకోండి

ఈ నెల ప్రారంభంలో ఒడిశాలోని బాలేశ్వర్‌లో రైలు ప్రమాదం సంభవించి చాలా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బాలేశ్వర్‌లోని బహంగా వద్ద సరుకు రవాణా రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. తర్వాత జస్వంత్‌పూర్..

LIC Claim Settlement: ఒడిశా రైలు ప్రమాదం బాధితులకు ఎల్‌ఐసీ పరిహారం.. ఎలా పొందాలో తెలుసుకోండి
Lic
Follow us
Subhash Goud

|

Updated on: Jun 20, 2023 | 2:35 PM

ఈ నెల ప్రారంభంలో ఒడిశాలోని బాలేశ్వర్‌లో రైలు ప్రమాదం సంభవించి చాలా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బాలేశ్వర్‌లోని బహంగా వద్ద సరుకు రవాణా రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. తర్వాత జస్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు చనిపోయారు. 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, ఒడిశా వాసులు ఉన్నారు. ఇక మృతులకు, క్షతగాత్రులకు కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించాయి. ఈసారి ఎల్‌ఐసీ బాధితులకు పరిహారం కూడా చెల్లించింది. గత శనివారం ఒడిశాలో మరణించిన ప్రయాణీకులలో 16 మందికి మాత్రమే ఎల్‌ఐసి ఉందని ఎల్‌ఐసి తెలిపింది. బీమా మొత్తం, ప్రమాదవశాత్తు ప్రయోజనం కలిపి మొత్తం రూ.48 లక్షల పరిహారం అందించబడింది. ఇంకా బీమా సొమ్ము అందని కోరమండల్‌ ప్రమాద మృతుల కుటుంబాలకు కూడా బీమా సొమ్ము ఎలా పొందాలనే దానిపై వివరించారు.

ఎల్‌ఐసీ వివరాల ప్రకారం.. ఒడిశాలోని రైలు ప్రమాదంలో మరణించిన ప్రయాణీకులలో 16 మంది మాత్రమే ఎల్‌ఐసి నుండి బీమా క్లెయిమ్ చేశారు. వారి మొత్తం బీమా మొత్తం 24.7 లక్షలు. పాలసీ వ్యవధిలో ఎల్‌ఐసికి చెందిన బీమాదారు ప్రమాదంలో మరణిస్తే ప్రమాద ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది. 48 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఎల్‌ఐసి అందజేసింది.

బీమా సొమ్ము ఎలా పొందాలి?

ఇంకా ఎల్‌ఐసీ నుంచి బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోని కోరమండల్‌ ప్రమాద బాధితులు కూడా దరఖాస్తు చేసుకునే విధానంపై వివరణ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన వారి మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇంకా మరణ ధృవీకరణ పత్రం లేకపోతే, రైల్వే, పోలీసు, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన డెడ్ లిస్ట్‌ను డెత్ సర్టిఫికేట్‌గా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

బీమా దరఖాస్తులలో కోరమండల్‌ ప్రమాద బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి ఎల్‌ఐసీ ద్వారా ప్రత్యేక హెల్ప్ డెస్క్, కాల్ సెంటర్ నంబర్ ప్రారంభించబడింది. ఈ నంబర్ 022-68276827. బీమా క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించేందుకు ఎల్‌ఐసీ ఏర్పాట్లు చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి