Aadhaar PAN: మీ పాన్ నంబర్ వేరొకరి ఆధార్‌తో లింక్ చేయబడిందా? పరిష్కరించడానికి ఇలా చేయండి
ఆధార్, పాన్ లింక్ చేయడానికి చివరిగడువు 30 జూన్ 2023. గడువుకు 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది . తమ పాన్ నంబర్‌కు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం లేదని చాలా మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు . కొంతమంది తమ పాన్ నంబర్ వేరొకరి ఆధార్ నంబర్‌తో లింక్ అయ్యిందని..
ఆధార్, పాన్ లింక్ చేయడానికి చివరిగడువు 30 జూన్ 2023. గడువుకు 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది . తమ పాన్ నంబర్‌కు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం లేదని చాలా మంది సోషల్ మీడియాలో చెబుతున్నారు . కొంతమంది తమ పాన్ నంబర్ వేరొకరి ఆధార్ నంబర్‌తో లింక్ అయ్యిందని చెబుతున్నారు. మీ ఆధార్ నంబర్ వేరే పాన్ నంబర్‌కి లింక్ చేయబడితే ఏమి చేయాలి ? ఇందుకు పరిష్కారం కూడా ఉంది. తప్పు పాన్ నంబర్ ఆధార్ నంబర్‌కి లింక్ చేయబడి ఉంటే మీరు ఆధార్ నుంచి పాన్ నంబర్‌ను డీలింక్ చేయాలి. ఆ తర్వాత సరైన పాన్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేసుకోవాలి.
మీరు ఎప్పుడు ఆధార్ – పాన్‌ను డీలింక్ చేయాలి ?
కొన్నిసార్లు సాంకేతిక లోపం కారణంగా ఐటీ శాఖ చాలా మందికి ఒకే పాన్ నంబర్ ఇస్తుంది. ఇలాంటివి గమనించిన వెంటనే, పాన్ నంబర్‌ను ఆధార్ నుండి డీలింక్ చేయాలి. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటున్నాయి. ఎక్కువ కార్డులున్నవారి పాన్ నంబర్లను డిసేబుల్ చేయాలి. మీరు దానిని ఆధార్‌కి లింక్ చేసి ఉంటే దాన్ని డీలింక్ చేయండి. ఇప్పుడు ఒకరి పాన్ కార్డ్ మరొకరి ఆధార్ నంబర్‌తో లింక్ చేసి ఉండవచ్చు. ఇది పొరపాటు కావచ్చు.
వేరొకరి ఆధార్ పాన్ నంబర్‌తో లింక్ అయితే ఏం చేయాలి?
- ఒకరి పాన్ నంబర్ మరొకరి ఆధార్ నంబర్‌తో లింక్ అయితే పాన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి పాన్ కార్డ్ ప్రాసెసింగ్ వివరాలను పొందండి.
- ఆదాయపు పన్ను వ్యాపార యాప్ నుంచి ఆడిట్ లాగ్ పొందండి.
- తప్పు లింక్ చేయడానికి కారణాన్ని గుర్తించండి. అలాగే అవసరమైతే డీలింక్ చేయాలని నిర్ణయించుకోండి.
- ఆదాయపు పన్ను శాఖకు అవసరమైన పత్రాలను సమర్పించండి.
JAOకి అప్పీల్‌ను సమర్పించండి
ఆధార్ నుండి పాన్‌ను డీలింక్ చేయడానికి మీరు JAO (జురిస్డిక్షనల్ అసెస్‌మెంట్ ఆఫీసర్) కి అభ్యర్థనను సమర్పించాలి. డీలింక్ కోసం ఏ JAOకి దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను పోర్టల్ లేదా ఈఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు. ఆదాయపు పన్ను పోర్టల్ లింక్‌పై క్లిక్ చేయండి. మీరు eFiling పోర్టల్‌కి వెళితే, లాగిన్ అయిన తర్వాత, గో టు ప్రొఫైల్‌పై క్లిక్ చేసి, ఆపై అధికారిక వివరాలపై క్లిక్ చేయండి. అక్కడ ఆధార్ డీలింకింగ్ కోసం జేఏవోకి అభ్యర్థనను సమర్పించవచ్చు. జేఏవో అధికారిక ఇమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీ సమస్యల పరిష్కారం అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి