TATA Cars: టాటా కార్లు కొనడానికి నెల మాత్రమే సమయం.. వచ్చే నెల నుంచి భారీగా ధరల బాదుడు

భారతదేశంలో టాటా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు అంటే అందరూ టాటా కార్ల వైపే చూస్తూ ఉంటారు. అయితే ఇటీవల టాటా కంపెనీల తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ధరలు పెరుగుదల లోపే కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ కార్ల ధరల పెంపు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

TATA Cars: టాటా కార్లు కొనడానికి నెల మాత్రమే సమయం.. వచ్చే నెల నుంచి భారీగా ధరల బాదుడు
Tata Cars
Follow us
Srinu

|

Updated on: Dec 12, 2024 | 3:15 PM

టాటా మోటార్స్ ఇటీవల తన కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు జనవరి 2025 నుంచి అమల్లోకి వస్తాయి. టాటా కంపెనీకు సంబంధించిన ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర మోడళ్లకు వర్తిస్తుంది. వేరియంట్, మోడల్ ఆధారంగా 3 శాతం వరకు పెరుగుతుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరలను పెంపును ప్రకటిస్తున్నట్లు టాటా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. టాటా నిర్ణయంతో త్వరలోనే మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా మరిన్ని వంటి కంపెనీలు త్వరలోనే ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 

టాటా కంపెనీకు సంబంధించి నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, టియాగో ఈవీ వంటి ప్రముఖ మోడల్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈవీ ప్రియులు వీలైనంత త్వరగా కార్లను కొనుగోలు చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ వల్ల పెరిగిన ఉత్పత్తి వ్యయం కారణంగా టాటా ఈవీ కార్ల ధరల పెంపును నిర్ణయం తీసుకుందని వివరిస్తున్నారు. టాటా మోటార్స్ నవంబర్ 2024లో కార్ల డెలివరీలో స్వల్వ వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ 2024లో ఈ కంపెనీ 74,753 యూనిట్లను డెలివరీ చేసింది. గతేడాది నవంబర్‌లో 74,172 యూనిట్లను విక్రయించింది. 

నవంబర్ 2023లో 46,143 యూనిట్ల నుంచి ఈవీలతో సహా ప్యాసింజర్ వాహన విక్రయాలు 2% పెరుగుదలను నమోదు చేశాయి. అంటే దాదాపు మొత్తం 47,117 యూనిట్లు పెరిగాయి. నవంబర్ 2024లో 47,063 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం అయితే 46,068 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇతర తయారీదారులు కూడా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పెరుగుతున్న వ్యయాల కారణంగా టాటా మోటార్స్ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. మారుతి సుజుకి కంపెనీ కూడా ఇటీవల 4 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ ధరలను రూ. 25,000 వరకు పెంచాలని యోచిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి