IRCTC New Feature: ఏఐ ద్వారా రైల్వే టిక్కెట్ల బుకింగ్.. అందుబాటులోకి స్పెషల్ ఫీచర్

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది అత్యంత చవకైన రవాణా సాధనంగా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే కచ్చితంగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో పెరిగిన టెక్నాలజీను వాడుకుని ఐఆర్‌సీటీసీ కూడా ఎప్పటికప్పుడు కొత్త సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐ సేవల ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది.

IRCTC New Feature: ఏఐ ద్వారా రైల్వే టిక్కెట్ల బుకింగ్.. అందుబాటులోకి స్పెషల్ ఫీచర్
Indian Railway 1[1]
Follow us
Srinu

|

Updated on: Dec 12, 2024 | 4:25 PM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కేవలం మాట్లాడటం ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి భారతీయ రైల్వేలు ఆస్క్ దిశా 2.0 పేరుతో ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. దాని సహాయంతో, మీరు మాట్లాడటం ద్వారా మీ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అలాగే టిక్కెట్లను అవసరమైతే రద్దు కూడా  చేయవచ్చు. ఆస్క్ దిశా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఎన్ఎల్‌పీ ఆధారంగా రూపొందించిన వర్చువల్ అసిస్టెంట్ చాట్‌బాట్. ఇది ప్రయాణీకులను రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, అలాగే రద్దు చేయడానికి, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చడానికి, రీఫండ్‌ను తనిఖీ చేయడానికి, పీఎన్ఆర్ స్థితిని తనిఖీ చేయడానికి, ఆఫర్‌లను అందించడానికి, సమాధానమివ్వడానికి అనుమతిస్తుంది. 

ఐఆర్‌సీటీసీ ఆస్క్ దిశా సాయంతో తొలిసారిగా రైలు ఈ-టికెట్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆస్క్ దిశ ద్వారా రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అలాగే పీఎన్ఆర్ స్థితిని తనిఖీ చేయవచ్చు, టిక్కెట్‌లను రద్దు చేయవచ్చు. వాపసు పొందవచ్చు. ముఖ్యంగా బోర్డింగ్ స్టేషన్‌ని మార్చవచ్చు. బుకింగ్ హిస్టరీను తనిఖీ చేయవచ్చు. ఈ-టికెట్‌లను వీక్షించవచ్చు. ఆస్క్ దిశ ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌లో ఈ చాట్‌బాట్‌ని ఉపయోగించవచ్చు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను తెరిచినప్పుడు మీకు కుడి వైపున ఒక చిహ్నం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు సులభంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కూడా ఈ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. దీనిని మాస్టర్ లిస్ట్ ఫీచర్ అని పిలుస్తారు. ఈ ఫీచర్ సహాయంతో ప్రయాణీకుల వివరాలు ముందుగానే సేవ్ అవుతాయి. దీని తర్వాత బుకింగ్ చేసేటప్పుడు, మీరు ప్రయాణికుల వివరాలను పూరించడానికి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు. వీలైనంత త్వరగా చెల్లింపు చేసి టిక్కెట్ బుకింగ్ చేయవచ్చు. ఆస్క్ దిశ ద్వారా తత్కాల్ బుకింగ్ ప్రక్రియ చాలా సులభం అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి