Jio New Year Welcome Plan: జియో అదిరిపోయే ఆఫర్.. న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్.. ప్రత్యేక కూపన్ ప్రయోజనాలు!
Jio New Year Welcome Plan: రిలయన్స్ జియో వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇటీవల రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది..
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువస్తోంది. మరో కొత్త ఏడాది వస్తుండటంతో ఇప్పటి నుంచే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ ను ఆవిష్కరించింది. డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు రీఛార్జ్ కోసం అందుబాటులో ఉండే ఈ ప్లాన్ వినియోగదారులకు భారీగా సేవింగ్స్, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
ప్లాన్ వివరాలు:
రూ.2025 ధరలో అందించే ఈ ప్లాన్‌లో ప్రయోజనాలు:
- అన్‌లిమిటెడ్ 5జీ యాక్సెస్ 200 రోజుల వ్యాలిడిటీ
- 500 GB 4జీ డేటా (రోజుకు 2.5 GB).
- అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMS.
- పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.
- ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే రూ.468 పొదుపు చేసుకోవచ్చు.
ప్రత్యేకమైన పార్టనర్ కూపన్లు
రూ.2025 ప్లాన్‌ను తీసుకునే వినియోగదారులు ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు:
- రూ.500 AJIO కూపన్: కనిష్ట కొనుగోలు రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఉపయోగించవచ్చు.
- స్విగ్గీపై రూ.150 తగ్గింపు: కనిష్ట ఆర్డర్ రూ.499 పై వర్తిస్తుంది.
- ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫ్లైట్ బుకింగ్ కోసం.
ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు. వినియోగదారులు జియో వెబ్‌సైట్, యాప్ లేదా ఆథరైజ్డ్ రీటైలర్ల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి