RBI New Governor: కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఎవరో తెలుసా?
RBI New Governor: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో అనేక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాను నియమించారు. అయితే శక్తికాంతదాస్ పదవీ కాలం పొడిగిస్తారని భావించినప్పటికి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత సెంట్రల్ బ్యాంక్ బాధ్యతలను శక్తికాంతదాస్ చేపట్టారు.
2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో అనేక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి పరిస్థితిలో సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఆర్థిక సేవల రంగంలో అతని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
సంజయ్ మల్హోత్రా ఎవరో తెలుసా?
సంజయ్ మల్హోత్రా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) కింద రాజస్థాన్ కేడర్ నుండి తన సేవను ప్రారంభించారు. సంజయ్ మల్హోత్రాకు ఆర్థిక సేవల రంగంలో అపారమైన అనుభవం ఉంది. అతను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. ఇది కాకుండా, అతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పన్ను, ఆర్థిక విషయాలలో లోతైన అనుభవం కూడా ఉంది.
మల్హోత్రా వచ్చే 3 సంవత్సరాల పాటు పదవిలో..
సంజయ్ మల్హోత్రా వచ్చే మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా కొనసాగనున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా పనితీరు ఎలా ఉంటుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Jio New Year Welcome Plan: జియో అదిరిపోయే ఆఫర్.. న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్.. ప్రత్యేక కూపన్ ప్రయోజనాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి