EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా

EPFO: క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐటి వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తద్వారా ఈపీఎఫ్‌వో సభ్యులు ఈ సౌలభ్యం పొందవచ్చని అన్నారు. క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించేందుకు కృషి..

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా
Follow us
Subhash Goud

|

Updated on: Dec 12, 2024 | 2:50 PM

మీకు ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉందా..? అయితే మీకో శుభవార్త. పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకునే విధానం మరింత సులభతరం కానుంది. ఇక నుంచి ఏటీఎంల నుంచి కూడా పీఎఫ్‌ నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చేస్తోంది. ఈ విధానాం వచ్చే ఏడాది అంటే 2025 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా బుధవారం కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే జనవరి నుంచి పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చుని అమె వెల్లడించారు. నగదు విత్‌డ్రాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరంగా, వేగవంతంగా మార్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు.

ఈపీఎఫ్‌వో ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్‌:

క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐటి వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తద్వారా ఈపీఎఫ్‌వో సభ్యులు ఈ సౌలభ్యం పొందవచ్చని అన్నారు. క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పిన ఆమె.. రాబోయే కాలంలో కస్టమర్ ఏటీఎం ద్వారా పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని పొందగలుగుతారన్నారు. EPF కింద ATM నుండి PF విత్‌డ్రా చేసుకునే సదుపాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ పెద్ద ప్రకటన వెలువడింది. అయితే ఏటీఎం ద్వారా ఉపసంహరణ మొత్తం మొత్తం డిపాజిట్‌లో 50%కి పరిమితం చేయబడుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలో అధిక సంఖ్యలో ఉన్నఈపీఎఫ్‌వో చందారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈపీఎఫ్‌వో ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి రెండు మూడు నెలలకోసారి అప్‌డేట్ చేస్తుంటామని, వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వస్తుందని సుమితా దావ్రా విశ్వాసం వ్యక్తం చేశారు.

పీఎఫ్‌ కార్డ్‌ ఏటీఎం కార్డు వలె ఉంటుంది:

ఈ పీఎఫ్‌ ఉపసంహరణ కార్డు బ్యాంకులు జారీ చేసే డెబిట్ కార్డుల వలె ఉంటుంది. పీఎఫ్‌ ఉపసంహరణ కార్డు సహాయంతో EPFO ​​సభ్యులు ATMకి వెళ్లి వారి పీఎఫ్‌ అ కౌంట్‌లో జమ చేసిన డబ్బును తీసుకోవచ్చు. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు పరిమితి ఉంటుందని తెలిపారు. ఈపీఎఫ్‌వో సభ్యులు తమ ఖాతాలో జమ చేసిన మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా పీఎఫ్ సెటిల్ మెంట్ ప్రక్రియ గతంలో కంటే చాలా సులభమైందని, అనవసర ప్రక్రియలను తొలగించామని చెప్పారు.

మునుపటిలాగే నిబంధలు:

విత్‌డ్రా నిబంధనలు మునుపటిలానే ఉంటాయని, ఒక వ్యక్తి ఒక నెలపాటు నిరుద్యోగిగా ఉంటే, అతను తన పీఎఫ్‌ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే రెండు నెలల తర్వాత, అతను తన ఖాతాలో జమ చేసిన డబ్బును తీసుకోవచ్చు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ చర్యతో ఉద్యోగులు వారి పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడం చాలా సులభం అవుతుంది.

తగ్గిననిరుద్యోగ రేటు:

మరోవైపు దేశంలో నిరుద్యోగ రేటు తగ్గిందని సుమితా దావ్రా అన్నారు. 2017లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. ప్రస్తుతం 3.2 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వోకు మొత్తం 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారని వెల్లడించారు. దీంతో పాటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో కూడా మెరుగుపడుతున్నాయని చెప్పారు. శ్రామిక శక్తి భాగస్వామ్య నిష్పత్తి ప్రస్తుతం 58 శాతంగా ఉంది. అలాగే ఇది నిరంతరం పెరుగుతోందన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి