Senior Citizen Savings Scheme: ఆ పథకంలో ఒక్కసారి పెట్టుబడితో వేలల్లో రాబడి.. సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రత్యేకమైన పథకమిదే..!
ఉద్యోగం వచ్చిన తొలినాళ్లల్లోనే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే పదవీ విరమణ సమయంలో అసాధారణ ఆదాయాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకేసారి వచ్చిన సొమ్మును సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే గణనీయమైన రాబడిని పొందవచ్చని వివరిస్తున్నారు. ఈ పథకంలో, ఒక సారి రూ. 10 లక్షల పెట్టుబడి మీరు త్రైమాసికానికి రూ. 20,500 లేదా సంవత్సరానికి రూ. 82,000 సంపాదించవచ్చని చెబుతున్నారు.
భారతదేశంలో ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ఉద్యోగులు సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆదాయ వనరు తరచుగా క్షీణిస్తుంది. కానీ వారి ఖర్చులు మాత్రం అలాగే ఉంటాయి. వారికి వారి నెలవారీ ఖర్చుల కోసం డబ్బు అవసరం. అదే సమయంలో వారికి వారి వైద్య ఖర్చులను తీర్చడంలో సహాయపడే ఆదాయ వనరు కూడా అవసరం. ఈ ఖర్చులను భరించేందుకు ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటేనే మంచిది. ఈ నేపథ్యంలో ఉద్యోగం వచ్చిన తొలినాళ్లల్లోనే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే పదవీ విరమణ సమయంలో అసాధారణ ఆదాయాన్ని అందిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకేసారి వచ్చిన సొమ్మును సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే గణనీయమైన రాబడిని పొందవచ్చని వివరిస్తున్నారు. ఈ పథకంలో, ఒక సారి రూ. 10 లక్షల పెట్టుబడి మీరు త్రైమాసికానికి రూ. 20,500 లేదా సంవత్సరానికి రూ. 82,000 సంపాదించవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌సీఎస్ఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
ఈ పథకం పోస్టాఫీసు ద్వారా నిర్వహించే చిన్న పొదుపు పథకం. హామీతో కూడిన రిటర్న్ స్కీమ్‌గా నిపుణులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్‌లు 8.20 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. నాన్-మార్కెట్-లింక్డ్ స్కీమ్ ఐదేళ్ల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. ఇక్కడ వడ్డీ రూపంలో త్రైమాసిక ఆదాయాన్ని పొందడానికి ఒకరు ఒకేసారి పెట్టుబడి పెడతారు. పథకంలో కనీస డిపాజిట్ రూ. 1,000గా ఉంటే గరిష్ట డిపాజిట్ రూ. 30 లక్షలుగా ఉంది. ఎస్‌సీఎస్ఎస్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌లు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.
60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా 55 సంవత్సరాల కంటే ఎక్కువ. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ సివిల్ ఉద్యోగి, 50 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు ఎస్‌సీఎస్ఎస్ ఖాతాను తెరిచే అవకాశం ఉంటుంది. ఖాతాదారులు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని పొందుతారు, డిపాజిట్ చేసిన తేదీ నుంచి మార్చి 31/జూన్ 30/సెప్టెంబర్ 30/డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఆర్జించిన వడ్డీ ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటితే పన్ను విధిస్తారు. నిర్ణీత రేటు వద్ద TDS చెల్లించిన మొత్తం వడ్డీ నుండి తీసివేయబడుతుంది.
రూ.82,000 ఆదాయం ఇలా
ఎస్‌సీఎస్ఎస్ ద్వారా రూ. 82,000 వార్షిక ఆదాయాన్ని పొందేందుకు సీనియర్ సిటిజన్ ఒక్కసారిగా రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడితో వారికి త్రైమాసిక వడ్డీ రూ.20,500 లభిస్తుంది. నాలుగు త్రైమాసికాల్లో ఆ మొత్తం రూ.82,000 అవుతుంది. పథకం మెచ్యూరిటీలో వారు తమ అసలు మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఈ పథకంలో కింద గరిష్టంగా రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు కాబట్టి ఆ మొత్తంతో వారికి రూ.61,500 త్రైమాసిక వడ్డీ లభిస్తుంది. నాలుగు త్రైమాసికాల్లో మొత్తం రూ.2,46,000 వడ్డీ లెక్కన అందుతుంది. మెచ్యూరిటీ తర్వాత, వారు తమ అసలు మొత్తం రూ. 30 లక్షలను తిరిగి పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..