Post office: రోజుకు రూ. 50 పొదుపు చేస్తే, రూ. 30 లక్షలు పొందొచ్చు..
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ ఇలాంటి ఎన్నో సేవింగ్ పథకాలను తీసుకొస్తున్నాయి. ఇలాంటి బెస్ట్ సేవింగ్ స్కీమ్స్‌లో గ్రామ్ సురక్ష పథకం ఒకటి. ఇది ఒక హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ. 1995లో పోస్టాఫీస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరిన వారు లేదా బీమా చేసిన వ్యక్తికి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత బోనస్‌తో కూడిన హామీ మొత్తాన్ని...
ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత పొదుపు చేస్తున్నామన్నది ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కచ్చితంతా పొదుపును అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ సేవింగ్స్ కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. ఇందుకోసం ప్రభుత్వ సంస్థలు సైతం పలు రకాల పథకాలను ప్రవేశ పెడుతున్నాయి.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ ఇలాంటి ఎన్నో సేవింగ్ పథకాలను తీసుకొస్తున్నాయి. ఇలాంటి బెస్ట్ సేవింగ్ స్కీమ్స్‌లో గ్రామ్ సురక్ష పథకం ఒకటి. ఇది ఒక హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ. 1995లో పోస్టాఫీస్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరిన వారు లేదా బీమా చేసిన వ్యక్తికి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత బోనస్‌తో కూడిన హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ సమయంలో బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే, నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందిస్తారు.
ఈ పథకంలో చేరాలనుకునే వారు 19 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందులో రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షల వరకు బీమా పాలసీని తీసుకోవచ్చు. ప్రీమియాన్ని 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారి చెల్లించుకునే అవకాశం ఉంటుంది. 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియంను చెల్లించుకోవచ్చు. అయితే 5 ఏళ్లలోపు సరెండర్ చేస్తే బోనస్‌కు అర్హులు కారు. కాగా పాలసీ తీసుకున్న 4 ఏళ్లు తర్వా రుణం కూడా పొందొచ్చు. ఈ రుఫంపై 10 శాతం వడ్డీ ఉంటుంది. సెక్షన్ 80C, సెక్షన్ 88 కింద పన్ను ప్రయోజనాలు సైతం పొందవచ్చు.
రూ. 30 లక్షలు ఎలా పొందొచ్చంటే..
ఉదాహరణకు మీకు 19 ఏళ్ల వయసున్నప్పుడు రూ. 10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకుందాం. అయితే 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిసే రూ. 31.6 లక్షలు పొందొచ్చు. అదే 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.33.4 లక్షలు, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.34.6 లక్షల మెచ్యూరిటీ పొందొచ్చు. ప్రీమియం విషయానికొస్తే.. 55 ఏళ్లకు అయితే నెలకు రూ. 1515, 58 ఏళ్లకు అయితే రూ. 1463, 60 ఏళ్లకు అయితే రూ. 1411 చెల్లించాల్సి ఉంటుంది. అంటే సుమారున రోజుకు రూ. 50 చెల్లిస్తే రూ. 30 లక్షలు పొందొచ్చన్నమాట.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..