Aadhaar Locking: ఆధార్‌తో పెరుగుతున్న మోసాలు.. ఆ ఒక్క పని చేస్తే మీ డేటా సురక్షితం

ఆధార్ అంటే ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు సంఖ్య. ఆధార్ సిస్టమ్ వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వ్యక్తుల గుర్తింపు సులభంగా మారింది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందనే చందాన ఆధార్ ఉపయోగించి మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్ లాకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Aadhaar Locking: ఆధార్‌తో పెరుగుతున్న మోసాలు.. ఆ ఒక్క పని చేస్తే మీ డేటా సురక్షితం
Aadhaar Card
Follow us
Srinu

|

Updated on: Jun 09, 2024 | 7:30 PM

భారతదేశంలో ఓ పదేళ్ల నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ అంటే ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు సంఖ్య. ఆధార్ సిస్టమ్ వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వ్యక్తుల గుర్తింపు సులభంగా మారింది. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉంటుందనే చందాన ఆధార్ ఉపయోగించి మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్ లాకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే మీ ఆధార్ లాక్ చేశాక మళ్లీ వినియోగించాలంటే కచ్చితంగా అన్‌లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్ లాక్ ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆధార్ లాకింగ్ ఫీచర్ ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. అయితే ఒక్కసారి లాక్ చేశాక మళ్లీ అన్‌లాక్ చేయాల్సిన సందర్భాలు రావచ్చు. మీరు మీ ఆధార్‌ను అన్‌లాక్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటే లేదా సింపుల్‌గా మన ఫోన్‌లో మై ఆధార్ యాప్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. యూఐడీఏఐ ఆధార్ భద్రతకు అందించే వర్చువల్ ఐడీ ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో బ్యాంకింగ్ లావాదేవీల్లో ఆధార్ కీలకపాత్ర పోషిస్తున్నందున బయోమెట్రిక్ ఆథంటికేషన్‌ను నిరోధించేందుకు ఆధార్ లాకింగ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను ఎలా లాక్ చేయాలో? ఓ సారి చూద్దాం. 

ఇవి కూడా చదవండి

ఆధార్ లాకింగ్ ఇలా

  • ఆధార్ హోల్డర్ యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఎంఆధార్ యాప్‌ ద్వారా మీ ఆధార్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు.
  • యూఐడీఏఐ వెబ్‌సైట్
  • యూఐడీఏఐ  వెబ్‌సైట్‌ను సందర్శించి మై ఆధార్‌ను ఎంచుకోవాలి. 
  • అనంతరం “ఆధార్ లాక్/అన్‌లాక్” సేవలపై క్లిక్ చేయాలి. 
  • లాక్ లేదా అన్‌లాక్ ఎంపికను ఎంచుకోవాలి. 
  • మీ ఆధార్, స్క్రీన్‌పై ప్రదర్శించే సెక్యూరిటీ కోడ్‌ని నమోదు చేయాలి. 
  • ధ్రువీకరణ కోసం మీరు వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని ఎలా పొందాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. ఎస్ఎంఎస్ లేదా టీఓటీపీ ఎంచుకోవచ్చు. 
  • అనంతరం మన ఫోన్‌కు వచ్చిన ఓటీపీను నమోదు చేసి సమర్పించాలి. మీ ఆధార్ ఇప్పుడు అన్‌లాక్ చేయబడాలి.

ఎం ఆధార్ యాప్ ఉపయోగించడం ఇలా

  • అధికారిక యాప్ స్టోర్ నుంచి ఎం ఆధార్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. 
  • యాప్‌ని తెరిచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఓటీపీను ఉపయోగించి లాగిన్ చేయాలి. 
  • అనంతరం లాక్/అన్‌లాక్ ఆధార్ విభాగాన్ని ఎంచుకోవాలి. 
  • ఆధార్‌ని అన్‌లాక్ చేయి ఎంచుకుని స్క్రీన్‌పై సూచనలను అనుసరించాలి.
  • ధ్రువీకరణ కోసం మీకు మీ వీఐడీ లేదా ఓటీపీ అవసరం కావచ్చు. అనంతరం మీ ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ అవుతుంది. 

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..