Dating Scam: డేటింగ్ పేరుతో ముంచుతున్న అమ్మాయిలు.. వారే అసలు టార్గెట్..!
ఇటీవల కాలంలో పెరిగిన నెట్ వినియోగాన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్, స్టాక్ మార్కెట్ మోసం, వాట్సాప్ స్కామ్‌లతో సహా వివిధ రకాల సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ స్కామ్‌లకు కొనసాగింపు తాజాగా ఓ సరికొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది.
పెరుగుతున్న టెక్నాలజీ మానవుని జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో? అదే స్థాయిలో అనర్థాలను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో పెరిగిన నెట్ వినియోగాన్ని ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్, స్టాక్ మార్కెట్ మోసం, వాట్సాప్ స్కామ్‌లతో సహా వివిధ రకాల సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ స్కామ్‌లకు కొనసాగింపు తాజాగా ఓ సరికొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదే రొమాన్స్ స్కామ్. ఈ స్కామ్‌లో నేరస్థులు వారి డబ్బును మోసపూరితంగా కోల్పోయే ముందు వారితో శృంగార సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో రొమాన్స్ స్కామ్‌లు పెరుగుతున్నాయి. చాలా మంది వ్యక్తులు టిండర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా కలుసుకున్న అమ్మాయిల చేతుల్లో బకరాలమయ్యామని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన డేటింగ్ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
డేటింగ్ యాప్ స్కామ్
టిండెర్, బంబుల్ వంటి ప్రసిద్ధ డేటింగ్ యాప్‌లలో రొమాన్స్ కోరుకునే వ్యక్తులు, ప్రత్యేకించి పురుషులు ఆర్కెస్ట్రేటెడ్ డేటింగ్ స్కామ్‌కు బలైపోతున్నారు. ఈ స్కామ్‌లో మోసగాళ్లు బాధితులను టార్గెట్ చేసి వారిని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. నివేదికల ప్రకారం ఈ స్కామ్‌కు పాల్పడే వారు చాలా చాకచక్యంగా పన్నాగాన్ని నిర్వహిస్తున్నారు. మోసగాళ్లు డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాన్ని ప్రారంభించి, వారితో మంచిగా మాట్లాడుతూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా స్కామర్‌లు తరచూ నగరానికి కొత్తవారిలా ముసుగు వేసుకుని, ఒంటరితనం, సాంగత్యం కోసం ఎదురుచూస్తున్నట్లు వారిని నమ్మిస్తారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి వారికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.
స్నేహం పేరుతో మరికొన్నిసార్లు ప్రేమ పేరుతో సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ అమ్మాయి వారిని స్థానిక క్లబ్‌లో కలవాలని కోరుతుంది. అయితే క్లబ్ విషయానికి వచ్చే స్కామ్ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఆ అమ్మాయి తాము చాలా డబ్బున్న వాళ్లమని పేర్కొని, ఖర్చుతో నిమిత్తం లేకుండా డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంది. ముఖ్యంగా చాలా మంది కేఫ్ మేనేజర్‌లు లేదా ఉద్యోగులు ఈ స్కామర్‌లతో స్కీమ్‌ను సమష్టిగా అమలు చేయడానికి కనెక్ట్ అయ్యారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత బిల్లు వచ్చినప్పుడు అసాధారణంగా రూ.20,000 నుంచి రూ.40,000 రూపాయల వరకు బిల్లు వస్తుంది. మొదట వారు నమ్మకపోయినప్పటికీ క్లబ్ ఓనర్స్ మాత్రం కచ్చితంగా బిల్లు చెల్లించాల్సిందేని చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఈ సమయానికే తమతో పాటు వచ్చిన అమ్మాయి చల్లగా జారుకుంటుంది. ఇంకేముంది లబోదిబోమంటూ ఆ బిల్లు చెల్లించి బయటపడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో ఇలాంటి స్కామ్స్ పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువత ఈ తరహా మోసాలపై అవగాహనతో ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..