- Telugu News Photo Gallery Business photos Electric kick to the market, These are the best EV scooters that give high mileage at a low price, Affordable EV Scooters DETAILS IN TELUGU
Affordable EV Scooters: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. తక్కువ ధరలో అధిక మైలేజ్‌ను ఇచ్చే ది బెస్ట్ ఈవీ స్కూటర్స్ ఇవే..!
భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ మార్కెట్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా టూ వీలర్స్ విభాగంలో ఈవీ స్కూటర్లు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మొదట్లో పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య నుంచి రక్షణకు స్కూటర్లు ప్రజలను ఆకట్టుకున్నా వాటి నిర్వహణ భారంతో సతమతమవుతూ ఉండేవారు. అయితే క్రమేపి ఈవీ స్కూటర్ల రాకతో ఆ సమస్యకు చెక్ పడింది. ముఖ్యంగా సగటు మధ్య తరగతి ఉద్యోగి స్కూటర్ నిర్వహణ అతి తక్కువ ధరలో అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈవీ స్కూటర్లకు గిరాకీ పెరిగింది. అయితే మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తక్కువ ధరలోనే అధిక మైలేజ్‌ను ఇచ్చే టాప్-5 ఈవీ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Jun 09, 2024 | 8:59 PM

ఓలా ఎస్1 ఎక్స్ భారతదేశంలోని సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది ఏఆర్ఏఐ ధ్రువీకరించిన శ్రేణి 190 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్ రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. ఎస్ 1 ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. 90 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో ఈ-స్కూటర్ 0-60 కేఎంపీహెచ్ నుంచి 5.5 సెకన్లలో దూసుకుపోతుంది.

బజాజ్ ఆటో భారతదేశంలో అత్యంత సరసమైన చేతక్ 2901 ఈ-స్కూటర్‌ను రూ. 95,998 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) విడుదల చేసింది. ఈ కొత్త చేతక్ స్పెషల్ ఎడిషన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీల ఏఆర్ఏఐ ధ్రువీకరించిన పరిధిని అందిస్తుంది. ఇది రంగురంగుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్ వంటి ఇతర ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

రెట్రో స్టైలింగ్‌ను అనుసరించి ప్యూర్ ఈవీ ప్లూటో 7జీ ఒక సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలుస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 92,999 (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఈ-స్కూటర్‌లో 2.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, హబ్-మౌంటెడ్ బీఎల్‌డీసీ మోటార్ అమర్చారు. ఈ స్కూటర్ 111 కి.మీ - 151 కి.మీ మధ్య మైలేజ్‌ను అందిస్తుంది. అలాగే 72 కి.మీ గరిష్ట వేగంతో వెళ్తుంది.

రూ. 94,900 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభించే ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఒక ఛార్జ్‌కి 100 కిమీ కంటే ఎక్కువ సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 సెకన్ల మధ్య 0-40 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 53 కి.మీగా ఉంటుంది.

రూ. 97,256 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లబించే కొమాకీ ఎస్ఈ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్‌కి 95-100 కిమీల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. 3 కేడబ్ల్యూ బీఎల్‌డీసీ మోటార్‌తో వచ్చే ఈ హై-స్పీడ్ ఈ -స్కూటర్ మూడు రైడ్ మోడ్‌లు అంటే ఎకో, టర్బో, స్పోర్ట్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి.




