Ola electric scooters: ఓలా కంపెనీని ఉతికి ఆరేస్తున్న కస్టమర్లు.. కారణం ఏంటో తెలుసా..?

ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు దేశ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలకునే వారందరూ ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ లోకి విడుదల అవుతున్న వివిధ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు వారిలో ఉత్సాహం నింపుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా చాలా సులభంగా నడిపే అవకాశం ఉండడంతో వీరికి ఆదరణ పెరిగింది.

Ola electric scooters: ఓలా కంపెనీని ఉతికి ఆరేస్తున్న కస్టమర్లు.. కారణం ఏంటో తెలుసా..?
Ola Scooters
Follow us
Srinu

|

Updated on: Sep 27, 2024 | 4:15 PM

ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోళ్లు దేశ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలకునే వారందరూ ఈవీలపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ లోకి విడుదల అవుతున్న వివిధ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు వారిలో ఉత్సాహం నింపుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా చాలా సులభంగా నడిపే అవకాశం ఉండడంతో వీరికి ఆదరణ పెరిగింది. ముఖ్యంగా నగరాల్లోని ట్రాఫిక్ రద్దీలో సునాయాసంగా ప్రయాణం చేయవచ్చు. ఈ వాహనాలలో ఓలా స్కూటర్లకు ప్రజల ఆదరణ బాగుంది. అయితే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి యజమానులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 స్కూటర్ల విషయంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ బాధలు, కష్టాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్కూటర్ లో హార్డ్‌వేర్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడం లేదు. అలాగే సాఫ్ట్‌వేర్ కూడా లోపాలు తలెత్తుతున్నాయి. వీటితో పాటు సర్వీసింగ్ విషయంలో కస్టమర్లు అనేక ఫిర్యాదు చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలు చేసిన మొదటి రోజు నుంచే హార్డ్‌వేర్ పనిచేయడం లేదని, సాఫ్ట్‌వేర్ గ్లిచింగ్ వంటి సమస్య కూడా ఎదురైందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఆగ్రహం

  • ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో వినియోగదారులు ఓలా ఎస్ 1 స్కూటర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆగ్రాలో ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ స్టేషన్ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని ఓ కస్టమర్ ధ్వజమెత్తాడు. సర్వీస్ స్టేషన్లకు పెద్ద ఎత్తున స్కూటర్లు వస్తున్నాయని, ఇలా ఈ కంపెనీ ఎంతో ముందుకు దూసుకుపోతోందని వ్యంగ్యంగా పోస్టు పెట్టాడు.
  • కష్టబడి సంపాదించిన డబ్బుతో ఓలా స్కూటర్ ను కొనుగోలు చేశానని, కానీ తరచూ సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని మరో కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
  • ముంబైలోని చెంబూర్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ మనోజ్ తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఓలా స్కూటర్‌ తీసుకున్న తర్వాత తరచుగా ఓలా సర్వీస్ సెంటర్‌కు ట్రిప్పులు వేస్తున్నానని చమత్కరించాడు. రూ. లక్షకు పైగా ఖర్చు చేసి ఓలా స్కూటర్ ను కొనుగోలు చేశారని, పెట్రోల్‌పై డబ్బులు ఆదా అవుతున్నా తరచూ కంపెనీ సర్వీస్ సెంటర్‌ను సందర్శిస్తున్నట్టు తెలిపాడు.
  • మయూర్ భగత్ అనే మరో వినియోగదారుడు తాను ఈ ఏడాది జూలైలో ఓలా ఎస్ 1 స్కూటర్ ను కొనుగోలు చేసినట్టు తెలిపాడు. సాఫ్ట్‌వేర్ లోపం ఉండడంతో వాహనంతో కనెక్ట్ అవ్వడానికి యాప్ నిరాకరిస్తుందన్నారు. ఓలా ఎలక్ట్రిక్ దాని డీలర్‌షిప్‌ను నిర్వహిస్తోందని, అదే ఫ్రాంచైజీ భాగస్వాములు దీనిని నిర్వహిస్తే సమస్యలు పరిష్కరించబడతాయని సూచించాడు.
  • ఇటువంటి సమస్యలపై ఓలా ఎలక్ట్రిక్ ప్రతి నెలా సుమారు 80 వేల ఫిర్యాదులను అదుకుంటోంది. ఒక్కోసారి రోజుకు 6 వేల నుంచి 7 వేల వరకూ పెరుగుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..