AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Battery Myths: భయపెడుతున్న ఈవీ బ్యాటరీలు.. అసలు నిజం తెలిస్తే షాక్

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్యులు ప్రత్యామ్నాయ రవాణా సాధనం ఈవీలను ఎంచుకుంటున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎంత పెరిగినా వినియోగదారులను మాత్రం బ్యాటరీ సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ బ్యాటరీ లైఫ్ చుట్టూ అనేక అనుమానాలు బలపడుతున్నాయి.

EV Battery Myths: భయపెడుతున్న ఈవీ బ్యాటరీలు.. అసలు నిజం తెలిస్తే షాక్
Electric Scooter Batteries
Follow us
Srinu

|

Updated on: Sep 27, 2024 | 4:00 PM

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్యులు ప్రత్యామ్నాయ రవాణా సాధనం ఈవీలను ఎంచుకుంటున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎంత పెరిగినా వినియోగదారులను మాత్రం బ్యాటరీ సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ బ్యాటరీ లైఫ్ చుట్టూ అనేక అనుమానాలు బలపడుతున్నాయి. బ్యాటరీ మన్నిక, రీప్లేసెబిలిటీ, భద్రత, నిర్వహణతో సహా చాలా విషయాల్లో వినియోగదారులకు అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటరీపై ప్రెజర్ పెరిగితే అవి పేలుతున్నాయని పలు నివేదికల వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బ్యాటరీ లైఫ్

ఈవీ బ్యాటరీ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఖర్చులో సుమారుగా 40 శాతంగా ఉంటుంది. ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి రీప్లేస్ చేయాల్సి ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వినియోగదారులు ఎలక్ట్రానిక్స్ కోసం స్థానికంగా లభించే బ్యాటరీల కంటే ఈవీ బ్యాటరీలు సామర్థ్యంలో చాలా భిన్నంగా ఉంటాయి. బ్యాటరీకు సంబంధించిన లైఫ్ వినియోగదారులు బ్యాటరీని ఛార్జ్ చేసే విధానం, కవర్ చేసిన మైలేజ్, తయారీదారు సిఫార్సుల నిర్వహణ విషయంలో ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్స్, థర్మల్ ప్రొటెక్షన్, ఛార్జ్, డిశ్చార్జ్ రేట్లు వంటి అంశాల రియల్ టైమ్ పర్యవేక్షణ వంటి ఆధునిక సాంకేతికతలు, ఆధునిక ఈవీ బ్యాటరీల జీవితకాలం గణనీయంగా పెరగడానికి దోహదపడతాయి. ముఖ్యంగా ఈవీ బ్యాటరీ 1,000 ఛార్జ్ సైకిళ్లకు మించి ఉంటుంది. అంటే బ్యాటరీ దాని సామర్థ్యాన్ని కోల్పోయే ముందు 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేస్తుంది. 

ఛార్జింగ్ సైకిల్స్ 

ఆధునిక ఈవీ బ్యాటరీలు క్షీణత లేకుండా అనేక ఛార్జ్-డిచ్ఛార్జ్ సైకిళ్లను నిర్వహించడానికి రూపొందిస్తున్నారు. అధునాతన సాంకేతికత ఇప్పుడు బ్యాటరీ ప్యాచ్‌లను వాటి సామర్థ్యం, జీవితకాలాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా 0 నుంచి 100 శాతం క్రమం తప్పకుండా ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. వాహనాన్ని స్థిరమైన వేగంతో నడపడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

భద్రతా ప్రమాదాలు

ఈవీ బ్యాటరీలు భద్రతా ప్రమాదమని, పేలి మంటలు వ్యాపించే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే కచ్చితమైన డిజైన్, కఠినమైన ధ్రువీకరణ ప్రక్రియలతో ఈవీ బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈవీ బ్యాటరీను రిలీజ్ చేసే ముందు కఠినమైన పరీక్షలు చేసి అందులో సానుకూల ఫలితాలు వస్తేనే వాడకానికి అనుమతి ఇస్తారు. కంపనాలు, షాక్, విపరీతమైన ఉష్ణోగ్రతలు, అగ్ని నిరోధకత వంటి పరీక్షల చేసి వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు కేవలం ఈవీ బ్యాటరీల వల్లే జరగవని నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఈవీ బ్యాటరీల భర్తీ

సాధారణంగా ఈవీ బ్యాటరీలను భర్తీ చేయలేమని అందరూ భావిస్తూ ఉంటారు. ఒకవేళ భర్తీ చేయాల్సి వచ్చినా సాధారణ బ్యాటరీల కొనుగోలుకు ఎంత ఖర్చు అవుతుందో? అంతే ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇది చాలా తప్పని నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల చాలా తక్కువ ఖర్చుతోనే ఈవీ బ్యాటరీలను భర్తీ చేయవచ్చని చెబుతున్నారు. ఈవీ బ్యాటరీల రీప్లేస్మెంట్ ఓఈఎం అధీకృత సేవా కేంద్రాల్లోనే చేయాల్సి ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి