AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investments: ఎస్ఐపీ, లంప్సమ్ విధానాల్లో ఏది బెస్ట్.. వాటి మధ్య తేడాలను తెలుసుకోవాల్సిందే..!

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మ్యూచువల్ ఫండ్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. వీటిలో పెట్టుబడి పెట్టేవారు క్రమంగా పెరుగుతున్నారు. దీర్ఘకాలంలో అత్యధిక సంపద పోగుచేయాలనుకునేవారికి ఇవి మంచి ఎంపికలుగా మారుతున్నాయి. గతంలో ఎక్కువ మంది బ్యాంకుల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాటిలో సిప్, లంప్సమ్ అనే రెండు విధానాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రెండింటిలో ఏది మంచిది, దేనిలో ఎక్కువ రాబడి వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Investments: ఎస్ఐపీ, లంప్సమ్ విధానాల్లో ఏది బెస్ట్.. వాటి మధ్య తేడాలను తెలుసుకోవాల్సిందే..!
Investment Tips
Nikhil
|

Updated on: Apr 29, 2025 | 5:00 PM

Share

సాధారణంగా పెట్టుబడి ప్రధాన ఉద్దేశం అధిక ఆదాయం సంపాదించడమే. కాబట్టి సక్రమమైన వ్యూహాలు, మార్కెట్ పై అవగాహన అవసరం. దీనికోసం పెట్టుబడిదారులు ఎందుకు, ఎలా, ఎక్కడ అనే విధానంలో ముందుకు వెళ్లాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఎందుకు అనే మీ ఆర్థిక లక్ష్యం, ఎలా అనేది మీకు వచ్చే నగదుపై ఆధారపడి ఉంటుంది. అంటే సిప్, లంప్సమ్ విధానాల్లో పెట్టుబడి పెట్టడం, చివరిగా ఎక్కడ అంటే రాబడినిచ్చే ఫండ్స్ ను ఎంపిక చేసుకోవడం. ఈ మూడింటినీ సక్రమంగా నిర్వహిస్తే మీ ఆర్థిక విజయానికి తిరుగు ఉండదు.

ప్రతినెలా వాయిదాల రూపంలో పెట్టుబడి పెట్టే విధానాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. అలా కాకుండా ఒకే సారి డబ్బును ఇన్వెస్ట్ చేస్తే దాన్ని లంప్సమ్ అంటారు. ఈ రెండు మధ్య తేడాల్లోకి వెళితే.. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సిప్ లు ఉపయోగపడతాయి. అస్థిర మార్కెట్ల పరిస్థితుల్లో ఇవి మంచి ఎంపికగా మారతాయి. ఎందుకంటే రూపాయి విలువ తగ్గినప్పుడు మీరు మరిన్ని యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఆదాయం పొందే వారికి సిప్ లు మంచి ఎంపిక. అయితే సిప్ లను కాలానుగుణంగా పెంచుకుంటూ వెళ్లకపోతే మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు.

లంప్సమ్ పెట్టుబడులు మరో రకమైన ప్రయోజనం కలిగిస్తాయి. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెడితే దానికి అనుగుణంగా రాబడిని ఇచ్చే మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. వాటిలో లాభదాయకమైన దానిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ అన్నమాట. తక్కువ సమయంలో పని పూర్తవ్వడంతో పాటు ప్రతి నెలా ఆలోచించే అవసరం ఉండదు. అయితే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది. మార్కెట్ క్షీణిస్తే పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది. ఈ విధానంలో లాభాలూ ఎక్కువే, రిస్కు కూడా ఎక్కువే.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైనా సిప్, లంప్సమ్ పెట్టుబడులు అనేవి మీకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఇవి ధీర్ఘకాలంలో రాబడిని ఇస్తాయి . కాబట్టి మీ ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసి, కుటుంబ అవసరాలకు పోను మిగిలిన దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీరు ఆర్థికంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
అభిషేక్ శర్మ ఓపెనింగ్ భాగస్వామి ఫిక్స్.. రంగంలోకి తుఫాన్ ప్లేయర్
అభిషేక్ శర్మ ఓపెనింగ్ భాగస్వామి ఫిక్స్.. రంగంలోకి తుఫాన్ ప్లేయర్
ప్రేమ విషయం బయటపెట్టిన ఫరియా అబ్దుల్లా..
ప్రేమ విషయం బయటపెట్టిన ఫరియా అబ్దుల్లా..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి