EPF: అసలు పీఎఫ్ ఎందుకు? దాని వల్ల ప్రయోజనం ఏమిటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే..
ఈ ఖాతాకు మీ జీతం నుంచి కొంత కంట్రిబ్యూషన్ తో పాటు మీ కంపెనీ యజమాని కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. ఇది మీ పదవీ విరమణ సమయానికి మీకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. అంతేకాక దీనిలో పెట్టుబడులు, వడ్డీ నగదుపై పన్ను రాయితీ కూడా లభిస్తుంది. మీరు పదవీవిరమణ చేసిన సమయంలో మీ కంట్రిబ్యూషన్, మీ యజమాని ఇచ్చే కంట్రిబ్యూషన్ దానిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ప్రతి ఉద్యోగికి ఈ ఖాతా ఉంటుంది. దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ఈ ఖాతా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇదే కేవలం పొదుపు ప్రణాళిక మాత్రమే కాదు. బహుళ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఖాతాకు మీ జీతం నుంచి కొంత కంట్రిబ్యూషన్ తో పాటు మీ కంపెనీ యజమాని కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. ఇది మీ పదవీ విరమణ సమయానికి మీకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. అంతేకాక దీనిలో పెట్టుబడులు, వడ్డీ నగదుపై పన్ను రాయితీ కూడా లభిస్తుంది. మీరు పదవీవిరమణ చేసిన సమయంలో మీ కంట్రిబ్యూషన్, మీ యజమాని ఇచ్చే కంట్రిబ్యూషన్ దానిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో పదవీవిరమణ తర్వాత పెన్షన్ కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈపీఎఫ్ లో యజమాని నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ ను పెన్షన్ ఫండ్ గా కొంత మొత్తాన్ని సేవ్ చేస్తుంది. అంటే అది ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)లో జమవుతుంది. అందువల్ల పదవీవిరమణ తర్వాత కూడా సుఖమయ జీవనానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అంతేకాక దీనిలో మంచి వడ్డీ రేటు ఉంటుంది.
ఈపీఎఫ్ ఇలా..
ఉద్యోగి కంట్రిబ్యూషన్: సాధారణంగా ఒక ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12% ఈపీఎఫ్ కు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. మహిళా ఉద్యోగులకు మాత్రం వారి ప్రారంభ మూడేళ్ల సర్వీసులో తక్కువ కాంట్రిబ్యూషన్ రేటు వర్తించే అవకాశం ఉంటుంది.
యజమాని కంట్రిబ్యూషన్: ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12%కి సరిపోతుంది. అయితే, యజమాని ఇచ్చే కంట్రిబ్యూషన్ రెండు భాగాలుగా విభజిస్తారు. అది ఈపీఎఫ్, ఈపీఎస్ గా విభజిస్తారు. అందువల్ల మీరు మీ యజమాని కంట్రిబ్యూషన్ తో పదవీవిరమణ కోసం మంచి నగదును పొదుపు చేసుకునే వీలుంటుంది.
ఈపీఎప్ బ్యాలెన్స్ తనిఖీ ఇలా..
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చాక మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేయడం సులభతరం అయింది. అధికారికి ఈపీఎఫ్ఓ వెబ్ సైట్, ఉమాంగ్ యాప్ ద్వారా బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. దీని కోసం మీకు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అవసరం.
ఈపీఎఫ్ఓ పోర్టల్:
- అధికారిక ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్‌బుక్ పోర్టల్‌ని సందర్శించండి.
- మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- సంబంధిత పీఎఫ్ ఖాతాను ఎంచుకోండి (మీకు ఒకటి కంటే ఎక్కువ ఉంటే).
- ‘వ్యూ పీఎఫ్ పాస్ బుక్’ విభాగంలో పూర్తి లావాదేవీ చరిత్ర, బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
ఉమాంగ్ యాప్:
- గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- దానిలో సైన్ అప్ చేసిన ఈపీఎఫ్ఓ విభాగానికి నావిగేట్ చేయండి.
- మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ని యాక్సెస్ చేయడానికి మీ యూఏఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి సైన్ ఇన్ చేసి, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ విధానంలో పీఎఫ్ బ్యాలెన్స్..
మీరు ఆఫ్‌లైన్ పద్ధతులను ఇష్టపడితే, రెండు సులభమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అవి ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ విధానాలు.
ఎస్ఎంఎస్:
మీ ఫోన్ నంబర్ కు యూఏఎన్ అనుసంధానమై ఉంటే 7738299899కి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అందుకోసం ఇలా టైప్ చేయాలి.. EPFOHO UAN ENG (ఇక్కడ “ENG” అనేది ఆంగ్ల భాషా కోడ్). అని పై నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలి. అప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంఎస్ఎం రూపంలో ఫోన్ కి వస్తుంది.
మిస్డ్ కాల్:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. అప్పుడు మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌తో ఎస్ఎంఎస్ ను అందుకుంటారు.
ఈపీఎఫ్ వల్ల ప్రయోజనాలు..
- ఈపీఎఫ్ అనేది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు. ఇది అనేక కీలక ప్రయోజనాలతో కూడిన సమగ్ర పదవీ విరమణ సాధనం. యాజమాన్య కంట్రిబ్యూషన్ ఇక్కడ అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి. ఇక్కడ మీ యజమాని మీ ఈపీఎఫ్ కు కంట్రిబ్యూట్ చేస్తారు. అందువల్ల మీ పొదుపులు రెట్టింపు అవుతాయి.
- ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందుతాయి. గణనీయమైన పన్ను మినహాయింపును అందిస్తాయి. ఇది అనేక ఇతర పొదుపు పథకాల కంటే మంచి వడ్డీ రేటును కూడా అందిస్తుంది.
- మీరు పదవీ విరమణ అనంతర సంవత్సరాల్లో ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందుకోవడంతో పాటు పెన్షన్ రూపంలో ప్రతి నెలా ఆదాయం వచ్చేందుకు ఉపకరిస్తుంది.
- ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహణలో ఉది ఉంటుంది కాబట్టి మీకు అధిక భద్రత, భరోసా ఉంటుంది.
- మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వల్ల మీరు మీ పొదుపులో అగ్రస్థానంలో ఉండటానికి సహాయపడుతుంది. ఒత్తిడి లేని పదవీ విరమణ కోసం మెరుగైన ఆర్థిక ప్రణాళికను అనుమతిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..