AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalpana Rai: 430కు పైగా సినిమాలు.. చివరి రోజుల్లో ఆకలితో అల్లాడి.. ఈ నటి కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటీనటులు తమదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వందల చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. కానీ సినీరంగుల ప్రపంచంలో వెండితెరపై కనిపించినంత అందంగా నటీనటుల జీవితాలు ఉంటాయనుకోవడం పొరపాటే. అయినవాళ్లు దూరం కావడంతో తీవ్ర మానసిక వేదన.. ఆర్థిక కష్టాలు అనుభవించి తనువు చాలించిన ఈ నటి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

Kalpana Rai: 430కు పైగా సినిమాలు.. చివరి రోజుల్లో ఆకలితో అల్లాడి.. ఈ నటి కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Kalpana Rai
Rajitha Chanti
|

Updated on: Apr 30, 2025 | 12:41 PM

Share

సినీరంగంలో చాలా మంది నటీనటులు తమ సహజ నటనతో సినీప్రియులను అలరించారు. ముఖ్యంగా తమ యాక్టింగ్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు కొందరు కమెడియన్స్. తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. తమ నటనతో అలరించిన పలువురు హాస్య నటీనటుల జీవితాలు మాత్రం అసలు ఊహించని విధంగా గడిచాయి. అందులో కల్పన రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలలో కనిపించింది. దక్షిణాదిలో దాదాపు 430 సినిమాల్లో నటించి మెప్పించింది. కల్పనా రాయ్ నటించిన జంబలకిడి పంబ, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎప్పుడు తన నటనతో నవ్వించిన కల్పనా రాయ్ జీవితంలో మాత్రం కొండంత విషాదం దాగుంది. మానసిక వేదన, ఆర్థిక కష్టాలతో ఇబ్బందిపడిన ఆమె చివరకు ఆకలితో ప్రాణాలు కోల్పోయింది.

1950లో కాకినాడలో జన్మించిన కల్పనా రాయ్ అసలు పేరు సత్యవతి. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నీడలేని ఆడది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత తెలుగులో వందలాది చిత్రాల్లో నటించింది. హస్యనటిగా, సహయ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. నటిగానే కాదు.. సాటి మనిషిగా తన తోటివారికి ఎంతో సహాయపడేది. సెట్ లో ఉండే ఉందరికి కడుపు నిండా అన్నం పెట్టేదట. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు సాయం చేసేది. కానీ మంచికి రోజులు లేవు అన్నట్లుగా ఆమె సాయం తీసుకున్నవారే మోసం చేసి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న కల్పనా రాయ్.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కూతురు వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది కల్పనా రాయ్.

ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గిపోయాయి. దీంతో సంపాదించిన ఆస్తి మొత్తం తగ్గిపోయింది. డబ్బులు లేకపోవడంతో పట్టించుకునేవాళ్లు కరువయ్యారు. ఆర్థిక కష్టాలు చూసింది. ఆమె చనిపోవడానికి ముందు పదిరోజులపాటు తిండిలేక ఆకలితో అలమటించిందట. ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చిందని..అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదని సీనియర్ నటి జయశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..