2025 Holidays: వచ్చే ఏడాది సెలవుల జాబితా ఇదే.. ఆ నెలలో ఎక్కువ హాలిడేస్‌

విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయంటే వారిలో ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మరి కొన్ని నెలల్లో ముగియనుంది. 2025 సంవత్సరం రాబోతోంది. అయితే ప్రతి సంవత్సరం ప్రభుత్వం సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే..

2025 Holidays: వచ్చే ఏడాది సెలవుల జాబితా ఇదే.. ఆ నెలలో ఎక్కువ హాలిడేస్‌
2025 Holidays
Follow us
Subhash Goud

|

Updated on: Sep 27, 2024 | 12:32 PM

విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయంటే వారిలో ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మరి కొన్ని నెలల్లో ముగియనుంది. 2025 సంవత్సరం రాబోతోంది. అయితే ప్రతి సంవత్సరం ప్రభుత్వం సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది 2025 సంవ‌త్స‌రానికి గాను ప్రభుత్వ సాధారణ సెలవుల‌ను ప్ర‌క‌టించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందరికీ ఇదే కేలండర్ అమలవుతుంది.

ఇది కూడా చదవండి: Sunday Holiday: ఆదివారమే సెలవు ఎందుకు? ఇది ఎలా వచ్చింది? ఆసక్తికర విషయాలు

గెజిటెడ్ సెలవులు తప్పనిసరిగా ప్రభుత్వ సెలవులు. అయితే పరిమితం చేసిన సెలవులు నియమాలతో ఉంటాయి. అలాగే సంస్థ, రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయని గమనించండి. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ 17 గెజిటెడ్, 34 ఆప్షనల్‌ హాలిడేస్‌ను ప్రకటిస్తూ ఒక సర్క్యులర్‌ను ప్రచురించింది. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థల ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ జాబితా ప్రకారం.. వచ్చే ఏడాది 2025లో ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో చూద్దాం.

ఇది కూడా చదవండి: SBI Card: ఇక సింగపూర్‌ తరహాలోనే భారత్‌లో అమలు..ఖాతా లేకుండా ఎస్‌బీఐ కార్డుతో చెల్లింపులు!

2025 పబ్లిక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే..

☛ జనవరి 26 (ఆదివారం)- గణతంత్ర దినోత్సవం

☛ ఫిబ్రవరి 26 (బుధవారం) – మహాశివరాత్రి

☛ మార్చి 14 (శుక్రవారం) హోళీ

☛ మార్చి 31 (సోమవారం) – ఈద్‌-ఉల్‌-ఫితర్‌

☛ ఏప్రిల్‌ 10 (గురువారం) – మహావీర్‌ జయంతి

☛ ఏప్రిల్‌ 18(శుక్రవారం) – గుడ్‌ప్రైడే

☛ మే 12 (సోమవారం) -బుద్ధ పూర్ణిమ

☛ జూన్‌ 7 (శనివారం) – బక్రీద్‌

☛ జూలై 6 (ఆదివారం)- మొహర్రం

☛ ఆగస్టు 15 (శుక్రవారం)- స్వాతంత్ర్య దినోత్సవం

☛ ఆగస్టు 16 (శనివారం) – జన్మాష్టమి

☛ సెప్టెంబర్‌ 5 (గురువారం) -మిలాద్‌-ఎన్‌-నబీ

☛ అక్టోబర్‌ 2 (గురువారం) – దసరా

☛ అక్టోబర్‌ 20 (సోమవారం) దీపావళి

☛ నవంబర్‌ 5 (బుధవారం) – గురు నానక్‌ జయంతి

☛ డిసెంబర్‌ 25 (గురువారం) – క్రిస్మస్‌

2025 ఆప్షనల్‌ హాలిడేస్‌

☛ జనవరి 1 (బుధవారం) – న్యూ ఇయర్‌

☛ జనవరి 16 (సోమవారం) గురు గోవింద్ సింగ్‌ జయంతి

☛ జనవరి 14 (మంగళవారం) – మకర సంక్రాంతి, పొంగల్‌

☛ ఫిబ్రవరి 2 (ఆదివారం) – బసంత పంచమి

☛ ఫిబ్రవరి 12 (బుధవారం) – గురు రవీదాస్‌ జయంతి

☛ ఫిబ్రవరి 19 (బుధవారం) – శివాజీ జయంతి

☛ ఫిబ్రవరి 23 (ఆదివారం) – స్వామి దయానంద స్వామి జయంతి

☛ మార్చి 13 (గురువారం) – హోలికా దహన్‌

☛ మార్చి 14 (శుక్రవారం) – డోలియాత్ర

☛ ఏప్రిల్‌ 16 (ఆదివారం) – రామ నవమి

☛ ఆగస్టు 15 (శుక్రవారం) – జన్మాష్టమి

☛ ఆగస్టు 27 (బుధవారం) -గణేష్‌ చతుర్థి (వినాయక చవితి)

☛ సెప్టెంబర్‌ 5 (శుక్రవారం) ఓనం (తిరువొనం)

☛ సెప్టెంబర్‌ 29 (సోమవారం) – దసరా (సప్తమి)

☛ సెప్టెంబర్‌ 30 (మంగళవారం) – దసరా (మహాశ్టమీ)

☛ అక్టోబర్‌ 1 (బుధవారం) – దసరా (మహానవమి)

☛ అక్టోబర్‌ 7 (మంగళవారం) – మహార్షి వాల్మీకి జయంతి

☛ అక్టోబర్‌ 10 (శుక్రవిరం) – కరక చతుర్థి (రర్వా చౌత్‌)

☛ అక్టోబర్‌ 20 (సోమవారం) – నరక చతుర్థి

☛ అక్టోబర్‌ 22 (బుధవారం) – గోవర్ధన్‌ పూజ

☛ అక్టోబర్‌ 23 (గురువారం) భాయ్‌ దూజ్‌

☛ అక్టోబర్‌ 28 (మంగళవారం) -ప్రతిహార శష్టి లేదా సూర్య శష్ఠి

☛ నవంబర్‌ 24 (సోమవారం) -గురు టేక్‌ బహదూర్‌ శహీద్‌ దినం

☛ డసెంబర్‌ 24 (బుధవారం) – క్రిస్మస్‌

ఇది కూడా చదవండి: PM Kisan: దసరా పండగకు ముందు రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత తేదీ ఖరారు.. ఎప్పుడంటే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి