AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Card: ఇక సింగపూర్‌ తరహాలోనే భారత్‌లో అమలు..ఖాతా లేకుండా ఎస్‌బీఐ కార్డుతో చెల్లింపులు!

భారతదేశం ప్రతిరోజూ ఒక కొత్త ప్రగతి కథను రాస్తోంది. డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించిన ఎస్‌బీఐ ఇప్పుడు సింగపూర్ తరహాలో ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టింది. సింగపూర్‌లో ఫ్లాష్ పే అని పిలువబడే కార్డ్ ఉంది. దాని ద్వారా మీరు ఖాతాకు లింక్ చేయకుండా ఆ కార్డ్ నుండి చెల్లింపు చేయవచ్చు...

SBI Card: ఇక సింగపూర్‌ తరహాలోనే భారత్‌లో అమలు..ఖాతా లేకుండా ఎస్‌బీఐ కార్డుతో చెల్లింపులు!
Subhash Goud
|

Updated on: Sep 27, 2024 | 10:33 AM

Share

భారతదేశం ప్రతిరోజూ ఒక కొత్త ప్రగతి కథను రాస్తోంది. డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టించిన ఎస్‌బీఐ ఇప్పుడు సింగపూర్ తరహాలో ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టింది. సింగపూర్‌లో ఫ్లాష్ పే అని పిలువబడే కార్డ్ ఉంది. దాని ద్వారా మీరు ఖాతాకు లింక్ చేయకుండా ఆ కార్డ్ నుండి చెల్లింపు చేయవచ్చు. ఇలాంటి కార్డులు ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సేవ్ సొల్యూషన్స్ సంయుక్తంగా ఒక ముఖ్యమైన చొరవ తీసుకున్నాయి. దీని కింద ఢిల్లీ మెట్రో స్టేషన్లలో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు (NCMC) ఇస్తోంది. మెట్రో ప్రయాణీకులకు సులభమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన చెల్లింపు పరిష్కారాలను అందించడం దీని లక్ష్యం.

మీరు దానిని ఎలా ఉపయోగించాలి?

ఎస్‌సీఎంసీ కార్డు కేవలం మెట్రో సేవలకే కాకుండా బస్సు, టోల్, షాపింగ్, ఏటీఎం నుండి నగదు ఉపసంహరణకు కూడా ఉపయోగించవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే కార్డు’ విజన్‌ని సాకారం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు.

ఈ భాగస్వామ్యం కింద మెట్రో స్టేషన్లలో ఎన్‌సీఎంసీ కార్డ్‌లను విక్రయించడం, వాటి యాక్టివేషన్ ప్రక్రియను సులభతరం చేసే బాధ్యత సేవ్ సొల్యూషన్స్‌కు అందించింది. సేవ్‌ సొల్యూషన్స్ ఉద్యోగులు మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటారు. వారు కార్డును కొనుగోలు చేయడంలో, యాక్టివేట్ చేయడంలో ప్రయాణీకులకు సహాయం చేస్తారు. ఈ ప్రక్రియతో ప్రయాణీకులు ఎక్కువ కార్డ్‌లను కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. లేదా విభిన్న చెల్లింపు పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

దీని స్పెషాలిటీ ఏంటి?

ఎన్‌సీఎంసీ కార్డ్ అతిపెద్ద ప్రయోజనం దాని ఇంటర్‌ఆపరేబిలిటీ. ఇది వివిధ నగరాలు, రవాణా వ్యవస్థలలో ఉపయోగకరంగా ఉంటుంది. మెట్రో స్టేషన్‌లు, ఇతర ఎన్‌సీఎంసీ మద్దతు ఉన్న టెర్మినల్స్‌లో ‘ట్యాప్-అండ్-గో’ సాంకేతికతతో చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. అదనంగా, ఈ కార్డ్ ఆఫ్‌లైన్ వాలెట్ సదుపాయాన్ని కలిగి ఉంది. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా కొంత మేరకు లావాదేవీలు జరుపుకునేందుకు వీలు కల్పిస్తుంది.

అదనంగా, ఎన్‌సీఎంసీ కార్డ్ POS (పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్స్‌లో కొనుగోళ్లకు, ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణకు ఉపయోగించవచ్చు. కొన్ని కార్డ్‌లు రోజువారీ ఉపసంహరణ, కొనుగోలు పరిమితులను కలిగి ఉంటాయి. ఇవి డెబిట్ కార్డ్‌లుగా కూడా పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి