Ola S1 X+ Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు షురూ.. ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్.. త్వరపడండి..
ఓలా ఎలక్ట్రిక్ నుంచి చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ డెలివరీలను ఆ సంస్థ ప్రారంభించింది. ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 1.10లక్షలు(ఎక్స్ షోరూం)నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ స్కూటర్ ఓలా సంస్థ ప్రారంభ ఆఫర్ కింద రూ. 20,000 తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ను మీరు రూ. 89,999(ఎక్స్ షోరూం)నకు కొనుగోలు చేయొచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ డెలివరీలను ఆ సంస్థ ప్రారంభించింది. ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 1.10లక్షలు(ఎక్స్ షోరూం)నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ స్కూటర్ ఓలా సంస్థ ప్రారంభ ఆఫర్ కింద రూ. 20,000 తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో ఈ స్కూటర్ ను మీరు రూ. 89,999(ఎక్స్ షోరూం)నకు కొనుగోలు చేయొచ్చు. అయితే ఇది పరమిత కాలపు ఆఫర్ అని ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది.
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్..
ఓలా నుంచి వచ్చిన సరికొత్త ఎస్1 ఎక్స్ ప్లస్ జెన్2 ప్లాట్ ఫారం ఆధారంగా రూపొందించారు. ఈ కొత్త ప్లాట్ ఫారం తో ఓవరాల్ స్కూటర్ పనితీరుమెరుగవుతుందని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా స్కూటర్ ఛాసిస్ డిజైన్ లో మార్పులు చేసిందని పేర్కొంది. అలాగే కొన్ని మూవింగ్ పార్టులను లైట్ వెయిట్లో తీసుకొచ్చినట్లు వివరించింది. అలాగే కొత్త బ్యాటరీ ప్యాక్ మెరుగైన థర్మల్ ఎఫీషియన్సీ, సేఫ్టీని అందిస్తుందని చెప్పింది.
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్పెసిఫికేషన్లు..
ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ లో 6కేడబ్ల్యూ(8బీహెచ్పీ) ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. మంచి యాక్సలరేషన్ కూడా ఉంటుంది. కేవలం 3.3 సెకండ్లలోనే సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతంది. దీనిలో 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 151 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఆఫర్లే ఆఫర్లు..
ఈ స్కూటర్ ను మీరు ఈ డిసెంబర్లో కొనుగోలు చేస్తే మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సెకండ్ జెనరేషన్ స్కూటర్ల ఎక్స్ టెండెడ్ వారంటీపై 50శాతం తగ్గింపును కొనుగోలు చేయొచ్చు. అలాగే ఎవరైనా రిఫరల్ ఇస్తే రూ. 2000 క్యాష్ బ్యాక్ ను కూడా పొందొచ్చు. అలాగే మీరు రిఫర్ చేసిన కస్టమర్ జెన్ 2 ఎస్2 ప్రో లేదా ఎస్1 ఎయిర్ స్కూటర్ కొనుగోలు చేస్తే వారికి కూడా రూ. 3000 తగ్గింపు లభిస్తుంది.
ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ధరలు ఇలా..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్ ప్రారంభ ఆఫర్తో రూ. 89,999 నుంచిప్రారంభమవుతోంది. అయితే జెన్ 2 ఎస్ ప్రో స్కూటర్ రూ. 1.47 లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. దీనిని కొనుగోలు చేయాలంటే ఈ నెలాఖరులోపు కొనుగోలు చేసుకోవాలి. ఈ నెల దాటితే ఈ ఆఫర్లు ఏమి ఉండవు. అంతేకాక మొత్తం ఓలా స్కూటర్ల ధరలన్నీ జనవరిలో పెరిగే అవకాశం కూడా ఉందని కంపెనీ సూచన ప్రాయంగా తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..