Maruti Suzuki: వచ్చే ఏడాదికి ముహూర్తం ఫిక్స్.. మారుతీ సుజుకీ నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న కార్లు ఇవే..

కాగా 2024 ఈ కంపెనీకి ఓ ల్యాండ్ మార్క్ ఇయర్ గా మారనుంది. ఎందుకంటే వచ్చే ఏడాదే ఈ కార్ మేకర్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మారుతి ధ్రువీకరించింది. తన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తయారీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని కాన్సెప్ట్ ను ఈ ఏడాది జనవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. అలాగే అక్టోబర్లో జపాన్లో జరిగిన ఆటో షోలో కూడా చూపించింది.

Maruti Suzuki: వచ్చే ఏడాదికి ముహూర్తం ఫిక్స్.. మారుతీ సుజుకీ నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న కార్లు ఇవే..
Maruti Suzuki Swift
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 10, 2023 | 8:52 PM

మారుతీ సుజుకీ.. మన దేశంలో ఈ బ్రాండ్ తెలియని వారుండరు. కార్లలో తక్కువ బడ్జెట్లో కారు కావాలనుకునేవ వారికి బెస్ట్ చాయిస్ ఈ కంపెనీ. కాగా 2024 ఈ కంపెనీకి ఓ ల్యాండ్ మార్క్ ఇయర్ గా మారనుంది. ఎందుకంటే వచ్చే ఏడాదే ఈ కార్ మేకర్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మారుతి ధ్రువీకరించింది. తన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తయారీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని కాన్సెప్ట్ ను ఈ ఏడాది జనవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. అలాగే అక్టోబర్లో జపాన్లో జరిగిన ఆటో షోలో కూడా చూపించింది. ఇదే కాక చిన్న కార్ల సెగ్మెంట్లోనూ ఎలక్ట్రిక్ వేరియంట్ ను లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకీ కార్ల జాబితాను ఓసారి చూద్దాం. దీనిలో స్విఫ్ట్, ఈవీఎక్స్, డీజైర్ ఫేస్ లిఫ్ట్ వంటి మోడళ్లు ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఫేస్ లిఫ్ట్..

కొత్త మోడల్ స్విఫ్ట్ కారును జపాన్లో ఇప్పటికే సుజుకీ లాంచ్ చేసింది. అదే వెర్షన్ ఇక్కడ కూడా ఆవిష్కరించేందుకు మారుతి సుజుకీ కసరత్తు చేస్తోంది. మన దేశీయ ప్రమానాలకు అనుగుణంగా కొన్ని ప్రాథమిక మార్పులైతే ఉండే అవకాశం ఉంది. దీనిలో ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్ ఉండనున్నాయి. ఇంటీరియర్ మొత్తం కూడా బాలెనో లుక్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఫీచర్లు, ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, కొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 12వోల్ట్స్ మైల్డ్ హై బ్రీడ్ పవర్ ట్రైన్ ఉంటుంది. దీనిలో ఫైవ్ స్పీడ్ సీవీటీ ట్రాన్స్ మిషన్ యూనిట్ ఉంటుంది. ఇది 80బీహెచ్పీ పవర్, 108ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ కూడా 23.4 కిలోమీటర్లు ప్రతి లీటర్ కు ఇస్తుంది. అదే హైబ్రీడ్ వెర్షన్ అయితే 24.5 కిలోమీటర్లు ప్రతి లీటర్ కు వస్తుంది.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్..

ఈ కారు తయారీను వచ్చే ఏడాది కంపెనీ ప్రారంభించనుంది. గుజరాత్ లోని సుజుకీ మోటార్స్ ఫేలిలిటీలో దీనిని తయారీని ప్రారంభించనుంది. ఇది కాంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ లో రానుంది. దీని పొడవు 4,300ఎంఎం, 1,800ఎంఎం వెడల్పు, 1,600ఎంఎం ఎత్తు ఉంటుంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఇది సింగిల్ చార్జ్ పై 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 60కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని డిజైన్ ఫ్యూచరిస్టింగ్ మోడల్లో ఉంటుంది. స్పోర్టీ ఎల్ఈడీ హెడ్ లైట్ డీఆర్ ఎల్ యూనిట్లు ఉంటాయి. ఎల్ఈడీ టైల్ లైట్స్, స్పోర్టీ అల్లాయ్ డిజైన్ ఉంటుంది. ఇంటీరియర్ విషయానికి వచ్చే సరికి ఈవీఎక్స్ మినిమలిస్టిక్ డ్యాష్ బోర్డ్ , డిజిటల్ డ్యూయల్ స్క్రీన్, ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ ప్లే ఉంటుంది. ఇది టాటా హారియర్ ఈవీకి పోటీగా మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్ లిఫ్ట్..

డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ కారు తొమ్మిదేళ్ల క్రితం లాంచ్ అయినప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పులేవి చేయలేదు. హోండా అమేజ్, హ్యాూందాయ్ ఆరా మోడళ్లలో పోటీ పడేందుకు వీలుగా దీనిలో కీలకమైన మార్పులు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ మన దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న సెడాన్ మోడల్ కారు డిజైర్ ఉండటం విశేషం. ఈ క్రమంలో డైజర్ ఫేస్ లిప్ట్ లాంచింగ్ గురించి కచ్చితమైన సమాచారాన్ని మారుతీ సుజుకీ అందించింది. ఇది త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో 1.2 లీటర్ మైల్డ్ హై బ్రీడ్ పెట్రోల్ యూనిట్ ఉంటుంది. అలాగే అప్ డేటెడ్ క్యాబిన్, ఇతర ఫీచర్లు ఉండనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్