Indian Railways: రైలు జర్నీలో హాట్ హాట్ పిజ్జా తినే అవకాశం.. ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే.
ఇండియన్ రైల్వే రూపు రేఖలు మారుతున్నాయి. అత్యాధునిక హంగులతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ వంటి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వే.. పాత రైళ్లలోనూ సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న వారు వాట్సాప్ ద్వారా ఫుడ్‌ను..
ఇండియన్ రైల్వే రూపు రేఖలు మారుతున్నాయి. అత్యాధునిక హంగులతో ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ వంటి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టిన ఇండియన్ రైల్వే.. పాత రైళ్లలోనూ సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న వారు వాట్సాప్ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పిజ్జాను కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇందులో భాగంగానే ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్‌తో ప్రముఖ ఫుడ్ చెయిన్ సంస్థ డొమినాస్ జతకట్టింది. దీంతో రైల్వే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పిజ్జాను ఆర్డర్ చేసుకోవచ్చు. నేరుగా మీ వద్దకు పిజ్జా డెలివరి అవుతుంది. ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ యాప్ అయిన ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ ద్వారా వెజ్, నాన్ వెజ్ పిజ్జాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంతకీ యాప్ ద్వారా పిజ్జాను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* మొదటగా ‘ఫుడ్ ఆన్ ట్రాక్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోని అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
* అనంతరం మీ పీఎన్‌ఆర్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత మీరు ఏ స్టేషన్‌లో పిజ్జాను తీసుకోవాలనుకుంటున్నారో స్టేషన్ పేరును ఎంటర్ చేయాలి.
* అనంతరం డొమినాస్ నుంచి మీకు నచ్చిన పిజ్జాను కార్ట్‌లోకి యాడ్ చేసుకోవాలి.
* చివరిగా పేమెంట్ చేస్తే మీరు కూర్చున్న చోటుకు పిజ్జాను తెచ్చిస్తారు.
డొమినాస్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు..
* ఇందు కోసం ముందుగా డొమినాస్ యాప్‌ను ఓపెన్ చేసి.. ‘డెలివర్ ఆన్ ట్రైన్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* తర్వాత మీ పీఎన్‌ఆర్ నెంబర్‌ను అందించారు.
* అనంతరం మీరు ఏ స్టేషన్‌లో ఆర్డర్‌ను తీసుకోవాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి.
* మీకు నచ్చిన పిజ్జాను సెలక్ట్ చేసుకొని పేమెంట్ చేస్తే సరిపోతుంది.
ఈ విషయాలు గుర్తుంచుకోండి..
* మీరు ఏ స్టేషన్‌లో అయితే ఆర్డర్ తీసుకోవాలనుకుంటున్నారో.. రైలు ఆ స్టేషన్‌కు చేరుకునే కంటే రెండు గంటల ముందే బుక్ చేసుకోవాలి.
* పేమెంట్ ఆర్డర్ చేసే సమయంలోనే ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
* డొమినాస్ సేవలు అందిస్తున్న స్టేషన్‌ను మాత్రమే ఎంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..