Revolt RV 400: ఒక్కసారి ఛార్జ్‌తో 150 కి.మీ నాన్‌స్టాప్.. స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే!

ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తోన్న సంస్థ రివోల్ట్ మోటార్స్.. 'రివోల్ట్ ఆర్‌వి 400' పేరుతో అదిరిపోయే మోడల్‌ను మార్కెట్‌లో కస్టమర్లకు..

Revolt RV 400: ఒక్కసారి ఛార్జ్‌తో 150 కి.మీ నాన్‌స్టాప్.. స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే!
Revolt Bike
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2023 | 9:04 AM

ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తోన్న సంస్థ రివోల్ట్ మోటార్స్.. ‘రివోల్ట్ ఆర్‌వి 400’ పేరుతో అదిరిపోయే మోడల్‌ను మార్కెట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన రీ-బుకింగ్‌లను సైతం ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి ఏఐ ఆధారిత బైక్ కావడంతో.. ఇందులో జియో లోకేట్, రిమోట్ స్టార్ట్ ఫంక్షనాలిటీ, సౌండ్ మార్చుకోవడం, జియో ఫెన్స్, రియల్ టైం స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకోవాలనుకుంటే, సదరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి.. కేవలం రూ.2499 టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునేందుకు లాస్ట్ డేట్ మార్చి 31 కాగా.. కంపెనీ మార్చి 15 నుంచి బైక్‌లను డెలివరీ చేయడం ప్రారంభించనుంది.

రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్‌లో 3kW మిడ్-డ్రైవ్ మోటార్‌ అమర్చబడి ఉంది. ఇది గరిష్టంగా 80kmph వేగాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో 3.24kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బైక్ ముందు వెనుక డిస్క్ బ్రేక్స్ అమర్చబడ్డాయి. అలాగే ఈ బైక్‌లో రైడింగ్ కోసం మూడు మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్. ఎకో మోడ్‌లో, బైక్ గరిష్టంగా 45 కి.మీ వేగం కాగా, సాధారణ మోడ్‌లో గరిష్ట వేగం 65 కి.మీగా.. స్పోర్ట్స్ మోడ్‌లో గరిష్ట వేగం 85 కి.మీగా నిర్దేశించబడింది.

ఇక ఈ బైక్ బ్యాటరీ మూడు గంటల్లో 75 శాతం చార్జ్, 4.5 గంటల్లో 100 శాతం చార్జ్ చేయబడుతుంది. ఈ బైక్ బ్యాటరీపై కంపెనీ ఆరేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని ఇస్తుంది. అదే సమయంలో, దాని ఛార్జర్‌పై రెండు సంవత్సరాల వారంటీ అందుబాటులో ఉంది. అలాగే దీని ధర రూ. 1 లక్షా 25 వేలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది రెడ్, బ్లాక్, గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంది.

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే