Loan Against Mutual Funds : పెద్ద మొత్తంలో ఈజీగా లోన్ కావాలా? ఇదే బెస్ట్ ఆప్షన్.. వడ్డీ కూడా చాలా తక్కువ..
అత్యవసర పరిస్థితుల్లో, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విక్రయించకుండానే మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలను సులభంగా పొందవచ్చు. అయితే ఈ రుణాలు మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఆలస్యం చేసే అవకాశం ఉంది.

మీకు అత్యవసరంగా లోన్ కావాల్సి వచ్చిందా? క్రెడిట్ కార్డు లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఒక వేళ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పటికే ఇన్ వెస్ట్ చేసి ఉంటే.. దాని సులభంగా, అత్యంత తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా వెంటనే డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
విక్రయించాల్సిన అవసరం లేదు..
మ్యూచువల్ ఫండ్‌లు(ఎంఎఫ్) సాధారణంగా మధ్యస్థ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు. కానీ అత్యవసర పరిస్థితుల్లో, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విక్రయించకుండానే మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలను సులభంగా పొందవచ్చు. అయితే ఈ రుణాలు మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఆలస్యం చేసే అవకాశం ఉంది. పెట్టుబడిని తాకకుండా ఉంచినట్లయితే, ఎంఎఫ్ ల నుంచి రాబడి నిజంగా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పరిస్థితులు నిజంగా డిమాండ్ చేస్తే బయట రుణాలు తీసుకోవడం బదులు ఎంఎఫ్ లతో రుణం తీసుకోవడమే మంచిదని నిపుణుల చెబుతున్నారు.
తక్కువ వడ్డీ..
మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం పొందడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి వడ్డీ రేటు. క్రెడిట్ కార్డ్ రుణాలు లేదా వ్యక్తిగత రుణాల కంటే రుణంపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా, డెట్ ఫండ్ పథకాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.
ఎవరు ఇస్తారు లోన్లు..
బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్ పై రుణాలను అందిస్తాయి. ఈక్విటీ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాన్ని పొందవచ్చు. ఇది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో చేయవచ్చు. దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ ను ష్యూరిటీ తీసుకొని రుణాలు ఇస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటు వచ్చే అవకాశం ఉంది. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, రుణదాత మీ మ్యూచువల్ ఫండ్పెట్టుబడులను విక్రయించి, లోన్ మొత్తాన్ని రికవరీ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..