New Electric Bike: ఒక్క ఛార్జ్‌తో 180 కిలోమీటర్ల ప్రయాణం.. రూ.999 లకే బుకింగ్.. మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్..
New Electric Bike: టోర్క్ క్రాటోస్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను బుధవారం భారతదేశంలో ప్రవేశపెట్టింది.
New Electric Bike: టోర్క్ క్రాటోస్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను బుధవారం భారతదేశంలో ప్రవేశపెట్టింది. స్పోర్ట్స్ లుక్‌తో వస్తున్న ఈ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో కేవలం రూ.1.02 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు (ఢిల్లీ సబ్సిడీతో సహా) కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ఫీచర్స్ కూడా అదుర్స్ అనేలా ఉన్నాయి. ఐడీసీ నుంచి 180 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధి కలిగి ఉంది. ఈ బైక్ క్రాటోస్, క్రాటోస్ ఆర్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది.
కాగా, కంపెనీ ఈ రెండు బైక్‌లకు సంబంధించి ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ నాటికి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా, ఈ బైక్‌లను కేవలం రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ బుకింగ్స్ దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. దేశంలోని ఏ మారుమూల ప్రాంతం వారైనా దీనిని బుక్ చేసుకోవచ్చునని, ప్రకటించిన సమయానికి డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది.
క్రాటోస్, క్రాటోస్ ఆర్ ధరలు.. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు.. ఇతర బైక్‌లతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. కంపెనీ వీటి ధరలను సబ్సిడీతో కలిపి ప్రకటించింది. ఢిల్లీలో స్టాండర్డ్ వేరియంట్ క్రాటోస్ ధర రూ. 1,02,499 గా నిర్ణయించగా, క్రాటోస్ ఆర్ ధర రూ. 1,17,499 గా నిర్ణయించారు.
పెద్ద నగరాల్లో మొదటి డెలివరీ.. తొలిదశలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పుణె వంటి పెద్ద నగరాల్లో దీన్ని ప్రవేశపెట్టి, ఆ తర్వాత రెండో దశలో మరిన్ని నగరాలను చేర్చనున్నారు.
ఫీచర్స్.. ఈ బైక్‌లకు IP67 రేటింగ్ ఉంది. అలాగే, ఇది 4 Kwh లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. దీని సహాయంతో 48V వోల్టేజ్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. డ్రైవింగ్ పరిధిని IDC 180 కిమీగా అందించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.
గరిష్ట వేగం గంటకు 105 కి.మీ.. ఈ బైక్‌లో యాక్సియల్ ఫ్లక్స్ రకం ఎలక్ట్రిక్ మోటార్ ఇవ్వబడింది. ఇది గరిష్టంగా 7.5 Kw శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 28 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం 4 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు.
ఇతర ఫీచర్లు.. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ క్రాటోస్ ఆర్ మోటార్‌సైకిల్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఇది జియో ఫెన్సింగ్, ఫైండ్ మై వెహికల్ ఫీచర్లు, ఇతర అదనపు కనెక్టివిటీ ఫీచర్లను కూడా ఇందులో ఉన్నాయి. ఇది మోటార్‌వాక్ అసిస్టెంట్ ఫీచర్‌లు, క్రాష్ అలర్ట్, వెకేషన్ మోడ్, ట్రాక్ మోడ్ అనలైజ్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
ఇక స్టాండర్డ్ మోడల్ ఒకే వైట్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. టాప్ మోడల్ వైట్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.
Also read:
Benefits of Methi: మెంతులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆకలిని పెంచడమే కాదు..
Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..