Portable AC: రూ. 2 వేలకే మినీ ఎయిర్ కూలర్.. మండుటెండల్లో మంచు కురిసే చలి.
అసలే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. మండుతున్న టెండలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉంటే భరించలేని ఉక్కపోతే. అందరికీ ఏసీలు పెట్టుకునే స్థోమత ఉండదు. కూలర్లు కొందామంటే...

అసలే ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. మండుతున్న టెండలతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఉంటే భరించలేని ఉక్కపోతే. అందరికీ ఏసీలు పెట్టుకునే స్థోమత ఉండదు. కూలర్లు కొందామంటే ధర ఎక్కువ. మరి ఎలా.? ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఓ అద్భుత ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. కేస్ ప్లస్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ ఫ్యాన్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ మినీ ఏసీ సమ్మర్‌లో చల్లగా ఉంచుతుంది.
ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయాల్లో, డెస్క్ వర్క్ చేసే వారికి, ఇంట్లో కరెంట్ లేని సమయంలో పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఈ మినీ ఏసీ అసలు ధర రూ. 5,999 కాగా అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ. 1999కే లభిస్తోంది. ఇక మినీ కూలర్ పాత కాలంలో ఉండే టేపు రికార్డర్ అంత పరిమాణంలో ఉంటుంది. పైన నీరు పోయడానికి అనువుగా ఒక పోర్షన్‌ను అందించారు. అందులో 500 ఎమ్‌ఎల్ వరకు నీటిని స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎఫెక్ట్ కోసం ఏడు రకాల ఎల్‌ఈడీ లైట్స్‌ను సైతం అందించారు.




ఫ్యాన్ విషయానికొస్తే 3 విండ్ స్పీడ్‌ను ఇచ్చారు. ఇక నీటిని స్ప్రే చేయడానికి మొత్తం 4 స్ప్రే మోడ్స్‌ను అందించారు. ఫ్యాన్ గాలి వీస్తున్న దిశలో నీరు పొగ రూపంలో వస్తుంది. దీనివల్ల ఎంత వేడిలోనైనా చల్లటి అనుభూతిని పొందొచ్చు. కరెంట్ ఇన్‌పుట్ కోసం టైప్ సీ పోర్ట్‌ను ఇచ్చారు. సాధారణ మొబైల్ ఛార్జర్‌తో ఫ్యాన్‌ను రన్ చేయొచ్చు. పవర్ బ్యాంక్‌లతో కూడా ఈ మినీ ఏసీ పని చేస్తుంది. దీంతో ట్రావెలింగ్ చేసే సమయంలోనూ దీనిని ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. 10 వాట్ వరకు గరిష్టంగా కరెంట్ ఇన్‌పుట్ ఇవ్వొచ్చు. ఇక ఇందులో టైమర్ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. దీని ద్వారా గరిష్టంగా మూడు గంటల వరకు టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. అంటే మూడు గంటల తర్వాత దనంతట అదే ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. ఈ మినీ ఏసీ కులర్‌ను కొనుగోలు చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..