Pizza Delivery: డెలివరీ బైక్‌లోనే మైక్రోవేవ్ ఓవెన్.. డోమినోస్ సంచలన ఆవిష్కరణ..
ముఖ్యంగా మెట్రో నగరాలతో పాటు చిన్న నగరాల్లో కూడా జోమోటో, స్విగ్గీ సేవలకు ప్రజలు అలవాటు పడ్డారు. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో ఆహార పదార్థాలను వేడిగా అందించడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ డోమినోస్ సరికొత్త ఆవిష్కరణకు సిద్ధపడింది. సరికొత్త ఈ-బైక్‌ను లాంచ్ చేసింది. అలాగే ఆ బైక్‌లోనే మైక్రోవేవ్ ఓవెన్ ఉండేలా రూపొందించింది. దీంతో కస్టమర్లకు వేడివేడిగా పిజ్జా డెలివరీ చేయవచ్చని డోమినోస్ ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ మంచి జోరు మీద ఉంది. అయితే ఆ ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌కు ఆద్యులు పిజ్జా డెలివరీలనే చెప్పాలి. మొదట్లో కేవలం డోమినోస్‌తో పాటు ఇతర కంపెనీలు పిజ్జాను హోం డెలివరీలు ఇవ్వడం ప్రారంభించాయి. క్రమేమి జోమోటో, స్విగ్గీ వంటి యాప్స్ రంగ ప్రవేశంతో ఈ ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ మార్కెట్ వేగవంతమైంది. ముఖ్యంగా మెట్రో నగరాలతో పాటు చిన్న నగరాల్లో కూడా జోమోటో, స్విగ్గీ సేవలకు ప్రజలు అలవాటు పడ్డారు. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో ఆహార పదార్థాలను వేడిగా అందించడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ డోమినోస్ సరికొత్త ఆవిష్కరణకు సిద్ధపడింది. సరికొత్త ఈ-బైక్‌ను లాంచ్ చేసింది. అలాగే ఆ బైక్‌లోనే మైక్రోవేవ్ ఓవెన్ ఉండేలా రూపొందించింది. దీంతో కస్టమర్లకు వేడివేడిగా పిజ్జా డెలివరీ చేయవచ్చని డోమినోస్ ప్రతినిధులు చెబుతున్నారు. డోమినోస్ తాజా ఆవిష్కరణకు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
డోమినోస్ పిజ్జా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ లాంచ్ చేసిన ఈ-బైక్ మరింత వేగవంతమైన డెలివరీను నిర్ధారిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ రద్దీ ఉండే నగరాల్లో సులభమైన డెలివరీ చేస్తుందని డోమినోస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 20-అంగుళాల టైర్లపై వచ్చే ఈ బైక్ డౌన్‌ట్యూబ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ వెనుకవైపు ఓవెన్‌ను ఉంచారు. ఈ ఆవిష్కరణ ద్వారా కస్టమర్లకు వేడివేడిగా రుచికరమైన పిజ్జాలు అందిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.
అయితే డోమినోస్ కంపెనీ లాంచ్ చేసిన ఈ-బైక్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో? వంటి వివరాలను ఇంకా పేర్కొన్నలేదు. ముఖ్యంగా జీ-ఫోర్స్‌లను 67 శాతం తగ్గించే స్పేస్ ఏజ్ సస్పెన్షన్ ద్వారా ఈ బైక్ ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ బైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జపాన్, జర్మనీ, లక్సెంబర్గ్, తైవాన్, మలేషియా, సింగపూర్, కంబోడియాల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..