MG Car Offers: ఆ మోడల్ కార్లపై ఎంజీ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.2.10 లక్షల వరకూ తగ్గింపులు
తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ కొన్ని మోడల్స్ కార్లపై అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా రూ.2.10 లక్షల తగ్గింపులను ఇస్తున్నట్లు పేర్కొంది. చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ కార్‌మేకర్ ఎంజీ ఆస్టర్, జెడ్‌ఎస్ ఈవీ, హెక్టర్, గ్లోస్టర్, కామెట్ ఈవీలతో సహా దాదాపు మొత్తం లైనప్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ తాజా తగ్గింపులు ఎంత మేర ఇస్తున్నాయో?ఓ సారి చూద్దాం.
భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా వినాయకచవితి ప్రారంభం నుంచి అన్ని కంపెనీలు పండుగల సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకోవడానికి మంచి మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అయితే ఈ పండుగల సీజన్ మరో రెండు నెలల్లో ముగుస్తున్నందున కంపెనీలు ఎప్పటికప్పుడు నయా ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు సొంత కారును కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో కారును కొనడం శుభసూచకంగా అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని కార్ల కంపెనీలు పండుగ సమయాల్లో మంచి ఆఫర్లను ఇస్తాయి. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ కొన్ని మోడల్స్ కార్లపై అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా రూ.2.10 లక్షల తగ్గింపులను ఇస్తున్నట్లు పేర్కొంది. చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ కార్‌మేకర్ ఎంజీ ఆస్టర్, జెడ్‌ఎస్ ఈవీ, హెక్టర్, గ్లోస్టర్, కామెట్ ఈవీలతో సహా దాదాపు మొత్తం లైనప్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ తాజా తగ్గింపులు ఎంత మేర ఇస్తున్నాయో?ఓ సారి చూద్దాం.
ఎంజీ హెక్టర్, గోస్టర్‌పై తగ్గింపులు
ఎంజీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్లోస్టర్‌కు సంబంధించిన అన్ని వేరియంట్‌లపై రూ.1.35 లక్షల తగ్గింపును అందిస్తుంది. రూ. 50,000 నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 50,000, లాయల్టీ బోనస్ రూ. 20,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 15,000 తగ్గింపులను అందిస్తుంది. అలాగే హెక్టర్ ప్లస్‌తో సహా హెక్టర్ శ్రేణిలోని అన్ని వేరియంట్‌లు ప్రత్యేకమైన వార్షికోత్సవ ధరలో అందిస్తుంది. కస్టమర్లు అదనంగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా ఎంట్రీ-లెవల్ స్టైల్ మాన్యువల్ వేరియంట్ కూడా రూ. 25,000 వినియోగదారుల తగ్గింపు లభిస్తుంది.
ఎంజీ ఆస్టర్ తగ్గింపులు
ఎంజీ ఆస్టర్‌ను కొనుగోలు చేసేవారికి రూ. 2.10 లక్షల వరకు ప్రయోజనాలతో గరిష్ట ఆఫర్‌లు అందిస్తున్నారు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఐదు ట్రిమ్‌లలో రూపొందించారు. స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్, సావీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్టర్‌అన్ని వేరియంట్‌లకు రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 వరకు లాయల్టీ బోనస్ అందిస్తున్నారు. అలాగే రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపు కూడా ఇస్తున్నారు. అదనంగా ఆఫర్‌లోని వేరియంట్‌ను బట్టి రూ. 25,000 నుంచి రూ. 1.25 లక్షల వరకు వినియోగదారు ఆఫర్‌లు అందిస్తున్నారు.
ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ, కామెట్ ఈవీ తగ్గింపులు ఇలా
ఎంజీ ఈవీ లైనప్ కోసం కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ అన్ని వేరియంట్‌లు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు ప్రత్యేక వార్షికోత్సవ ధరతో అందిస్తున్నారు. అలాగే రూ.20,000 లాయల్టీ బోనస్, రూ. 15,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. అదనంగా జెడ్‌ఎస్ ఈవీకు ఎక్సైట్ వేరియంట్ రూ. 50,000 వినియోగదారు ఆఫర్‌తో వస్తుంది. అలాగే ఎంజీ కామెట్ ఈవీపై రూ. 20,000 లాయల్టీ బోనస్‌తో పాటు రూ. 15,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. అదనంగా ఈవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీఓ చార్జీలను మినహాయించారు. ముఖ్యంగా జెడ్‌ఎస్ ఈవీ కొనుగోలుపై రూ.1కే బీమాను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..