MG Electric car: ‘కామెట్’ చూడండి.. కామెంట్ చేయండి.. కారు చూడటానికి చిన్నదే కానీ.. గట్టి ఫీచర్లున్నాయండోయ్.. మీరు ఓ లుక్కేయండి..

ఎంజీ కంపెనీ సిటీ అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని ఓ కారును ఆవిష్కరించింది. చూడటానికి టాటా నానో లుక్ లో ఉన్న కారును ఇటీవల పరిచయం చేసింది. ఇప్పుడు దాని పేరుని రివీల్ చేసింది. ఎంజీ కామెట్(Mg Comet) గా నామకరణం చేసింది.

MG Electric car: 'కామెట్' చూడండి.. కామెంట్ చేయండి.. కారు చూడటానికి చిన్నదే కానీ.. గట్టి ఫీచర్లున్నాయండోయ్.. మీరు ఓ లుక్కేయండి..
Mg Comet
Follow us
Madhu

|

Updated on: Mar 04, 2023 | 6:22 PM

ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ శ్రేణి కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అది కంపెనీల మధ్య పోటీ వాతావరణాన్ని కలుగజేస్తోంది. పలు దిగ్గజ కంపెనీలు సైతం అత్యాధునిక ఫీచర్లతో తమ ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. మన భారతదేశంలో కూడా ఇదే తరహా వాతావరణం ఉంది. రోజురోజుకూ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పెరుగుతోంది. ఫలితంగా పలు అంతర్జాతీయ కంపెనీలు సైతం ఇక్కడ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఎంజీ కంపెనీ సిటీ అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని ఓ కారును ఆవిష్కరించింది. చూడటానికి టాటా నానో లుక్ లో ఉన్న కారును ఇటీవల పరిచయం చేసింది. ఇప్పుడు దాని పేరుని రివీల్ చేసింది. ఎంజీ కామెట్(Mg Comet) గా దీనికి నామకరణం చేసింది. దీనిలో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆ పేరు ఎక్కడి నుంచి పెట్టారు..

ఎంజీ కామెట్ అని కారుకి పెట్టారు. ఈ పేరు 1934 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పోటీపడిన బ్రిటిష్ విమానం నుంచి తీసుకున్నారని కంపెనీ తెలిపింది. ఆ కాలంలో కామెట్ విమానానికి చాలా గుర్తింపు ఉండేదని, ఆ విమానంతో చాలా యుద్దాలు చేసేవారట. అందుకే ఈ కారుకు ఎంజీ కామెట్ అని పేరు పెట్టారట. ఈ కారును భారత్‌లోనే విడుదల చేయడమేకాకుండా అంతర్జాతీయం స్థాయిలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ సూచన ప్రాయంగా తెలిపింది.

చిన్నదైనా గట్టిదే..

కామెట్ ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్ అత్యాధునిక సాంకేతికతతో రాబోతోంది. అయితే ఇది చిన్న కారు కావడంతో కేవలం రెండు తలుపులు మాత్రమే ఉంటుంది. ఇది చూడడానికి చిన్న సైజ్‌లో ఉంటుంది. అంతేకాకుండా రూమి వీల్‌బేస్, లోపల ఓపెన్ ఇంటీరియర్‌ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ కారు ధర విషయానికొస్తే రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో ఉండబోతోందని అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాలు..

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కామెట్ ఈవీ 2.9 మీటర్ల పొడవు ఉంటుందని తెలుస్తోంది. ఇది భారతదేశంలోనే అతి చిన్న హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో పొడవు 3.4 మీటర్లు, టాటా నానో పొడవు 3 మీటర్లు.దీనిలోని బ్యాటరీ ప్యాక్ 20kWh ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 150 కిలోమీటర్ల డ్రైవింగ్ మైలేజి ఇస్తుంది. దీనిలో 40 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది. ఇక పెద్ద టచ్‌స్క్రీన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆటోమొబైల్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!