పిజ్జా తయారీకి వాడే పిండిపై బాత్రూమ్ బ్రష్‌లు.. డొమినోస్ తీరుపై మండిపడుతోన్న నెటిజన్లు.. కంపెనీ వెర్షన్ ఏంటంటే.
Viral Video: కొంత మంది నిర్లక్ష్యం ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న మంచి పేరును ఒక్క క్షణంలో పాడయ్యేలా చేస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. పిజ్జాకు పెట్టింది పేరైన డొమినోస్ నిర్వహకులు..
Viral Video: కొంత మంది నిర్లక్ష్యం ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న మంచి పేరును ఒక్క క్షణంలో పాడయ్యేలా చేస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. పిజ్జాకు పెట్టింది పేరైన డొమినోస్ నిర్వహకులు చేసిన పని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిద్ధం చేసిన పిండిపై బాత్రూమ్ బ్రష్‌లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ఓ కస్టమర్ డొమినోస్ అవుట్‌లెట్‌కు వెళ్లి పిజ్జా ఆర్డర్ చేసి బయటకు వెళ్లాడు. అయితే పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చే సమయానికి స్టోర్ మూసేశారు. అవుట్‌లెట్ వెనకాల డోర్ వద్ద ఎదురు చూడమని చెప్పేసరికి.. అక్కడికి వెళ్లిన సదరు కస్టమర్‌కు కనిపించిన దృశ్యాన్ని స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి ట్వీట్ చేశాడు. దీంతో ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. డొమినోస్ నిర్వాకంపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
We adhere to stringent world-class protocols for ensuring the highest standards of hygiene and food safety. We have zero tolerance for violations of these operating standards. The incident brought to our notice will be thoroughly investigated and basis the findings, (1/2)
— dominos_india (@dominos_india) August 14, 2022
అధికారికంగా స్పందించిన డొమినోస్..
వైరల్‌గా మారిన ఈ ట్వీట్ డొమినోస్ నిర్వాహకుల దృష్టికి చేరింది. దీంతో ఈ సంఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన నెల క్రితం జరిగిందని తెలిపిన డొమినోస్ సదరు అవుట్‌లెట్‌పై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డొమినోస్ అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..