Post Office Schemes: పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఈనెల 31 లాస్ట్ డేట్..

Post Office Schemes: గ్రామీణ ప్రాంత ప్రజలకు, వృత్తి వ్యాపారాలు చేసేవారు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసు (Post office) అందించే

Post Office Schemes: పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఈనెల 31 లాస్ట్ డేట్..
Follow us

|

Updated on: Mar 08, 2022 | 9:57 AM

Post Office Schemes: గ్రామీణ ప్రాంత ప్రజలకు, వృత్తి వ్యాపారాలు చేసేవారు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసు (Post office) అందించే సేవింగ్స్ స్కీమ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పోస్టాఫీసులో అనేక సేవింగ్స్ పథకాలు ఉన్నాయి. వాటిలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(MIS), టైమ్ డిపాజిట్లు(TD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్(SCSS) వంటి మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల్లో సేవింగ్స్ చేయడం ద్వారా ఖాతాదారులు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. ఈ వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా కూడా చేసుకునే సదుపాయం ఉంది. అయితే, ఈ వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక సర్క్యలర్ జారీ చేసింది. 2022 ఏప్రిల్ 1 నుంచి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వ‌డ్డీ ఆదాయాన్ని అనుసంధానిత పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు ఖాతాకు మాత్రమే జ‌మ చేస్తామ‌ని పోస్టల్‌ శాఖ ప్రకటించింది.

మార్చి 31 డెడ్ లైన్.. పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌కు సంబంధించిన వడ్డీ ఆదాయం పోస్టాఫీస్ అకౌంట్ లేదా బ్యాంకు అకౌంట్‌కు మాత్రమే జమ చేస్తారు. అయితే, ఇందుకోసం పోస్టాఫీసు ఖాతాల్లో పెట్టుబడులు పెట్టేవారు మార్చి 31వ తేదీలోపు వారి ఖాతాల‌ను పోస్టాఫీసు పొదుపు ఖాతా, బ్యాంక్‌ అకౌంట్‌తో త‌ప్పనిస‌రిగా అనుసంధానం చేయాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఒక‌వేళ ఈ తేదీలోపు అనుసంధానించ‌కపోతే వ‌డ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ అకౌంట్‌కు(Sundry Account)కు బ‌దిలీ చేస్తామ‌ని పేర్కంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా న‌గ‌దు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వ‌డ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా, చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామ‌ని స్పష్టం చేసింది పోస్టల్ శాఖ‌.

లింక్ చేయ‌డం వల్ల కలిగే ప్రయోజ‌నాలివే..

  1. పొదుపు పథకాల నుంచి పొందిన‌ వ‌డ్డీ ఆదాయాన్ని నేరుగా విత్‌డ్రా చేసుకోకుండా పొదుపు ఖాతాకు జ‌మ‌చేయ‌డం వ‌ల్ల వ‌డ్డీ ఆదాయంపై తిరిగి వ‌డ్డీ లభిస్తుంది.
  2. డిపాజిట్‌ దారులకు నగదు అవసరమైతే పోస్టాఫీసుకు రాకుండానే వ‌డ్డీ ఆదాయాన్ని ఆన్‌లైన్‌ స‌హా వివిధ మార్గాల్లో విత్‌డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.
  3. డిపాజిటర్లు తమ పొదుపు పథకాల నుంచి పొందిన వ‌డ్డీ ఆదాయాన్ని పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా రిక‌రింగ్‌ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతాలకు ఆటోమేటిక్‌గా జమయ్యే సౌకర్యాన్ని పొందొచ్చు.

Also read:

News Watch: అంటే.. మోదీ హ్యాట్రిక్ కొడుతున్నారా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Viral Photo: మీకో సవాల్.. ఈ ఫోటోలో అందమైన జంతువు దాగుంది.. అదేంటో కనిపెట్టే శక్తి మీకుందా?

RRB NTPC row: ఈ విషయంపై త్వరలోనే పరిష్కారం సూచిస్తాం.. రైల్వే శాఖ మంత్రి!

Latest Articles
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!