AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings: పొదుపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. జీవితంలో ఈ సమస్యలు తప్పవు.. సేవింగ్ టిప్స్‌ మీకోసం..

Saving Tips: కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోతుంటాయి. కాలంతో పాటు అంతా పరిగెత్తాలి. కాలానుగుణంగా లైఫ్ స్టైల్‌ మారిపోతుంది. గతంలో చాలా మంది సంపాదన ఎంత అని అడిగేవాళ్లు. ఇప్పుడు సంపాదన మాట పక్కన..

Savings: పొదుపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. జీవితంలో ఈ సమస్యలు తప్పవు.. సేవింగ్ టిప్స్‌ మీకోసం..
Money
Amarnadh Daneti
|

Updated on: Dec 31, 2022 | 8:55 AM

Share

Saving Tips: కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోతుంటాయి. కాలంతో పాటు అంతా పరిగెత్తాలి. కాలానుగుణంగా లైఫ్ స్టైల్‌ మారిపోతుంది. గతంలో చాలా మంది సంపాదన ఎంత అని అడిగేవాళ్లు. ఇప్పుడు సంపాదన మాట పక్కన పెట్టి.. ఎంత పొదుపు చేశారు. ఏ రకంగా సేవ్ చేశారు. ఇవే ప్రశ్నలు ప్రస్తుతం ఎదురవుతాయి. సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో వేలల్లో. లక్షల్లో జీతాలు కామన్ అయిపోయాయి చాలా మందికి. దీంతో ఎంత సంపాదించినా.. అందుకలో భవిష్యత్తు అవసరాల కోసం ఎంత పొదుపు చేశారనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఈక్రమంలో కొత్తగా సంపాదన ప్రారంభించి భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకోవాలనుకునేవారు ఏమి చేస్తే డబ్బులు పొదుపు చేయవచ్చో తెలుసుకుందాం.. సంపాదించిన ప్రారంభ నెలల్లో పెద్ద పెద్ద ఖర్చులకు దూరంగా ఉండాలి. మనకు వస్తున్న ఆదాయం ఎలా ఖర్చవుతుందో కొన్ని నెలల పాటు అబ్జర్వ్ చేయాలి, అద్దె ఎంత చెల్లిస్తున్నాం, ఫోన్ నిర్వహణకు, భోజనం, ప్రయాణం.. ఇలా నిత్యావసరాలకు ఎంత ఖర్చవుతోందనేది అంచనా వేసుకోవాలి. రెగ్యులర్‌ అవసరాలు కాకుండా ఇంకా దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవాలి. ప్రారంభంలోనే ఎక్కువ ఖర్చు పెట్టి విలాసవంతమైన వస్తువులు కొనడానికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మన దగ్గర ఉన్న డబ్బలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవాలి. ఏది అవసరం.. ఏది అనవసరం అనేది ముందుగా డిసైట్ చేసుకోవాలి. నెలవారీ ఖర్చులుపోనూ మిగిలిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారనేది గమనంలో పెట్టుకోవాలి. మనకు వస్తున్న ఆదాయాన్ని సరిగ్గా ఖర్చ పెట్టడం, ఓ రకంగా చెప్పాలంటే డబ్బు నిర్వహణ అనేది ఒక నైపుణ్యం. ఎప్పటికప్పుడు కొత్త ఖర్చులు వస్తూనే ఉంటాయి. వాటన్నింటికి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోయేలా చూసుకోవాలి. బ్యాంకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ ఎంతో తరచూ చెక్‌ చేసుకుంటుండాలి. నెలమొత్తానికి అవి సరిపోయేలా చూసుకోవాలి. మీ దగ్గర మిగిలి ఉన్న సొమ్ముకు అనుగుణంగా ఖర్చులు ఉండాలంటున్నారు నిపుణులు.

ఓ వ్యక్తి తనకు వచ్చే సంపాదనలో భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయడాన్ని తప్పనిసరి చేసుకోవాలి. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాలకు మన దగ్గర పొదుపు చేసుకున్న మొత్తం ఉపయోగపడుతుంది. అలాకాదని నిర్లక్ష్యం చేస్తే.. అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటందున్నారు నిపుణులు. యువత సాధారణంగా అనవసర ఖర్చలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే మనం పెట్టే ఖర్చు దేనికోసం చేస్తున్నాం. దానివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటనేది ముందుగా డిసైడ్ అయితే అనవసర ఖర్చును నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..