AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POMIS: నెలవారి ఆదాయం కావాలనుకునేవారికి.. అదిరిపోయే పోస్టల్‌ స్కీమ్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..

Post Office Monthly Income Scheme: ఈరోజు మనం చేసే పొదుపు.. రేపటి జీవితానికి భరోసా.. అందుకే చాలా మంది పొదుపును అలవాటుగా చేసుకుంటారు. సరిగ్గా తిన్నా, తినకపోయిన.. నెలవారీ వచ్చే సంపాదనలో కొంతమొత్తాన్ని

POMIS: నెలవారి ఆదాయం కావాలనుకునేవారికి.. అదిరిపోయే పోస్టల్‌ స్కీమ్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..
Post Office
Amarnadh Daneti
|

Updated on: Dec 31, 2022 | 7:49 AM

Share

Post Office Monthly Income Scheme: ఈరోజు మనం చేసే పొదుపు.. రేపటి జీవితానికి భరోసా.. అందుకే చాలా మంది పొదుపును అలవాటుగా చేసుకుంటారు. సరిగ్గా తిన్నా, తినకపోయిన.. నెలవారీ వచ్చే సంపాదనలో కొంతమొత్తాన్ని పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ పొదుపు చేసిన మొత్తాన్ని కొంతమంది తమ బ్యాంకు అకౌంట్‌లో ఉంచుకుంటే.. మరికొందరు పొదపు మొత్తాన్ని వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం లేదా బంగారం కొనడం ద్వారా పొదుపును పెట్టుబడిగా మార్చి రాబడి పొందుతుంటారు. చాలామంది పొదుపు చేసిన మొత్తాన్ని ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. నగదు భద్రంగా ఉండటంతో పాటు.. మంచి రాబడి వచ్చే వాటిపై తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. మరికొంతమంది ముఖ్యంగా వయసు పెరుగుతున్నవారు అయితే.. నెలవారీ తమకు కొంత మొత్తం ఆదాయంగా వస్తే బెటర్‌ అని ఆలోచిస్తుంటారు. ఇలాంటివారి కోసం వివిధ బ్యాంకులు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు అయితే సేవింగ్ అకౌంట్‌లో నిర్ధేశించిన మొత్తం నగదు ఉంటే దానిపై నెలవారీ వడ్డిని అందిస్తున్నాయి. ఇలాంటి పథకాలను పోస్టల్‌ శాఖ అందిస్తోంది. నెలకు ఐదు వేల రూపాయలు ఆదాయం వచ్చేలా మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి అందిస్తోంది. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలి. ఎవరు అర్హులు అనే వివరాలు తెలుసుకుందాం.

సేవింగ్స్‌ కోసం పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువుగా పోస్టల్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము దాచుకున్న డబ్బులకు భద్రత ఉంటుందనే కారణంగా ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో పొదుపు చేయడం ద్వారా.. రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత.. నెలకు నిర్ణీత మొత్తంలో నగదు వచ్చే పథకాల కోసం చాలా మంది చూస్తుంటారు. అలాంటివారికి ఉత్తమమైన పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఒకటి. నెలనెలా మీకు నిర్ణీత మొత్తంలో ఆదాయం రావాలంటే ఎస్‌ఐపి ద్వారా పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో నిర్ధేశించిన కాలపరిమితి తర్వాత నెలవారీ ఆదాయ పథకం (పీవోఎమ్‌ఐఎస్‌) అవకాశాన్ని పొందే సౌలభ్యం ఉంటుంది. ఈ పథకంలో ఒకే మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పథకంలో డబ్బును డిపాజిట్‌ చేసిన ఐదేళ్ల తర్వాత తిరిగి పొందుతారు. పీవోఎమ్‌ఐఎస్‌ పథకంలో సింగిల్, జాయింట్‌ ఖాతాలను తెరిచే వెసులుబాటు ఉంది. రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ కోసం చాలా మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పీవోఎమ్‌ఐఎస్‌ పథకంలో సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ పథకంలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే 6.6 శాతం చొప్పున ఏడాదికి మొత్తం వడ్డీ రూ.59,400 వస్తుంది. ఈ మొత్తాన్ని 12 నెలల పాటు నెలనెలా ఇస్తారు. ఈ విధంగా ప్రతి నెల వడ్డీ దాదాపు రూ.5వేలు అందిస్తారు. అదే జాయింట్ ఖాతా కాకుండా సింగిల్‌ అకౌంట్‌ అయితే మాత్రం నెలవారీ వడ్డీ రూ.2,475 అవుతుంది. ఈ పథకంలో చేరాలంటే పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్‌ తెరవాలి. ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదో ఒకటి ఉండాలి. వీటితో పాటు.. రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, చిరునామా ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ ఖాతాకు సంబంధించిన ధరఖాస్తును ఆన్‌లైన్‌ లో పోస్టాఫీసు అధికారిక వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఖాతా తెరవడానికి రూ.వెయ్యి రూపాయలు మొదట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పొదుపు ఖాతా తెరిచిన తర్వాత పోస్టల్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం చూడండి..