AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra మహీంద్రా కంపెనీ నుంచి కొత్త లుక్‌తో మరో ఎలక్ట్రిక్ కారు.. తొలిసారి ఆ ఫీచర్.. ధర ఎంతంటే..?

ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో రికార్డులు సృష్టిస్తున్న మహీంద్రా తాజాగా మరో కారును లాంచ్ చేసింది. వచ్చే నెలలో టెస్ట్ డ్రైవ్‌కు అవకాశం కల్పించనుండగా.. జనవరి నుంచి బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. 7 సీటర్ సామర్థ్యంతో వస్తున్న ఈ ఎస్‌యూవీ కారు ఫీచర్లు ఏంటో చూద్దాం.

Mahindra మహీంద్రా కంపెనీ నుంచి కొత్త లుక్‌తో మరో ఎలక్ట్రిక్ కారు.. తొలిసారి ఆ  ఫీచర్..  ధర ఎంతంటే..?
Mahindra Xuv 9s
Venkatrao Lella
|

Updated on: Nov 27, 2025 | 3:07 PM

Share

Mahindra XEV 9S: ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ జోరు కొనసాగిస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో కూడా తన హవా కనబరుస్తుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్లు ట్రెండింగ్ సృష్టిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండగా.. ఇందుకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసినవారికి అనేక సదుపాయాలు కూడా కల్పిస్తోంది. దీంతో మార్కెట్‌లో వీటి కొనుగోళ్లు పెరగ్గా.. కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లలో కార్లను తయారు చేస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎప్పటినుంచో తన బ్రాండ్ నిలబెట్టుకున్న మహీంద్రా కంపెనీ.. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల్లో అన్నీ కంపెనీల కంటే టాప్‌లో ఉంటుంది. తాజాగా మహీంద్రా మరో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది.

జనవరి 14 నుంచి బుకింగ్స్

ఎక్స్‌ఈవీ 9ఎస్ మోడల్ పేరుతో కొత్త కారును తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 7 సీటర్ ఎస్‌యూవీ ఇది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి బుకింగ్స్ తెరవనుండగా.. 23వ తేదీ నుంచి డెలివరీ ఇవ్వనున్నారు. ఇక డిసెంబర్ నుంచి టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభం కానున్నాయి. గతంలో ఎక్స్‌ఈవీ 9ఈ, బీఈ6ఈ పేరుతో రెండు ఎస్‌యూవీ వెహికల్స్‌ను మహీంద్రా విడుదల చేసింది. ఆ కేటగిరీలో ఇది మూడోవది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో హహీంద్రా కంపెనీ విడుదల చేసిన తొలి 7 సీటర్ వెహికల్ ఇదే కావడం గమనార్హం.

ఫీచర్లు

-59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్ -షట్-ఆఫ్ గ్రిల్, L-ఆకారపు LED DRLలు ప్రొజెక్టర్ ల్యాంప్‌లు, LED లైట్ బార్ -ఫ్లష్-ఫిటెడ్ డోర్ హ్యాండిల్స్‌ -మోడల్ ఏరో-ఆప్టిమైజ్ చేయబడిన చక్రాలు -రూఫ్ రెయిల్‌ -స్క్రీన్ డాష్‌బోర్డ్ లేఅవుట్ -పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ -పవర్డ్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్ -SUV లెవల్ 2+ ADAS, బ్రేక్-బై-వైర్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ -ఇంటెలిజెంట్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ -మూడుడు ఎయిర్‌బ్యాగ్‌లు -లైవ్ వెహికల్ సర్వైలెన్స్ సిస్టమ్

ధర విషయానికొస్తే..

ఎంట్రీ-లెవల్ 59 kWh వేరియంట్‌కు ధర రూ.19.95 లక్షలుగా నిర్ణయించింది. ఇక టాప్-స్పెక్ ప్యాక్ త్రీ అబోవ్ మోడల్‌ ధర రూ.29.45 లక్షలుగా ఉంది.

Follow Us