AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Vatsalya: మైనర్ల కోసం పెన్షన్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసిన ప్రముఖ బ్యాంక్‌.. ప్రయోజనాలు ఏంటంటే..?

దేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ పిల్లల ఆర్థిక భవిష్యత్తును భద్రపరిచే లక్ష్యంతో పెన్షన్ స్కీమ్ ఎన్‌పిఎస్ వాత్సల్యను ప్రారంభించినట్లు ప్రకటించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ జూలైలో నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వానికి సంబంధించిన మొదటి బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

NPS Vatsalya: మైనర్ల కోసం పెన్షన్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసిన ప్రముఖ బ్యాంక్‌.. ప్రయోజనాలు ఏంటంటే..?
Nps Vatsalya Scheme
Nikhil
|

Updated on: Sep 21, 2024 | 5:30 PM

Share

దేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ పిల్లల ఆర్థిక భవిష్యత్తును భద్రపరిచే లక్ష్యంతో పెన్షన్ స్కీమ్ ఎన్‌పిఎస్ వాత్సల్యను ప్రారంభించినట్లు ప్రకటించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ జూలైలో నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వానికి సంబంధించిన మొదటి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ మైనర్ పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి ఆర్థిక భవిష్యత్‌ కోసం పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇస్తుంది. మైనార్టీ తీరాక సదరు ఖాతాదారుడు ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతాను సాధారణ ఎన్‌పీఎస్‌ ఖాతాగా మార్చవచ్చు. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో ఈ స్కీమ్‌ను ప్రకటించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకంలో భాగంగా  పిల్లలకు సింబాలిక్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్‌) కార్డులను కూడా అందిస్తారు. భారత ప్రభుత్వం, పీఎఫ్‌ఆర్‌డీఏతో కలిసి ఎన్‌పీఎస్‌ వాత్సల్య లాంచ్ స్కీమ్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నామని ఐసిఐసిఐ బ్యాంక్‌లోని హెడ్-డిపాజిట్ ప్రొడక్ట్స్ శ్రీరామ్ అన్నారు. కస్టమర్ల ఇకపై ఎన్‌పిఎస్ వాత్సల్య ఖాతాను దేశంలోని ఏ ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచ్‌లోనైనా తెరవచ్చని స్పష్టం చేశారు. ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం దీర్ఘకాలిక సంపదను సృష్టించవచ్చని ఆయన తెలిపారు. 

ఇవి కూడా చదవండి

ఎన్‌పీఎస్‌ వాత్సల్య అకౌంట్‌ కావాలంటే

  • పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగి ఉన్న ఏదైనా మైనర్ (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) అర్హులు 
  • ఈ పథకంలో గరిష్ట సహకారంపై పరిమితి లేకుండా సంవత్సరానికి కనీసం రూ. 1,000 విరాళం ఇవ్వవచ్చు
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల తరపున సహకారం అందించవచ్చు.
  • 18 సంవత్సరాల వయస్సు తర్వాత  అవసరమైన కేవైసీ పత్రాలను సమర్పించిన తర్వాత మైనర్‌కు సంబంధించిన ఎన్‌పీఎస్‌ ఖాతా ప్రామాణిక ఎన్‌పీఎస్‌ ఖాతాకు మార్చవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి