AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Certificate: పింఛన్‌దారులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్‌ అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చాలా మంది పేర్కొంటూ ఉంటారు. ఇది పెన్షనర్ల కోసం రూపొందించిన బయోమెట్రిక్ డిజిటల్‌ సర్వీస్‌. ఈ  సర్వీస్‌ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా పింఛన్‌ అందించడానికి ధ్రువీకరణ ఈ సర్టిఫికెట్‌ ఆధారంగానే సాగుతుంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌లను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డిజిటల్‌గా సమర్పించవచ్చు.

Life Certificate: పింఛన్‌దారులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌
Senior Citizens
Nikhil
|

Updated on: Sep 21, 2024 | 5:07 PM

Share

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్‌ అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చాలా మంది పేర్కొంటూ ఉంటారు. ఇది పెన్షనర్ల కోసం రూపొందించిన బయోమెట్రిక్ డిజిటల్‌ సర్వీస్‌. ఈ  సర్వీస్‌ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా పింఛన్‌ అందించడానికి ధ్రువీకరణ ఈ సర్టిఫికెట్‌ ఆధారంగానే సాగుతుంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌లను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డిజిటల్‌గా సమర్పించవచ్చు. గతంలో పెన్షనర్లు తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించడానికి ప్రతి సంవత్సరం వారి పెన్షన్ పంపిణీ చేసే సంస్థలను వ్యక్తిగతంగా సందర్శించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికెట్‌ రాకతో ఈ ఇబ్బంది తప్పింది. అయితే పెరుగుతున్న టెక్నాలజీకు అనుగుణంగా ఇకపై పింఛన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఇంటి నుంచే పొందే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌ ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్లను పొందడం ఇలా

  • భారతదేశం అంతటా ఉన్న సీఎస్‌సీ సెంటర్ల ద్వారా జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికెట్లను పొందవచ్చు. 
  • పింఛనుదారులు జీవన్ ప్రమాణ్ పోర్టల్‌ని సందర్శించి ఫింగర్‌ప్రింట్ రీడర్‌ని ఉపయోగించి వేలిముద్రల ఉపయోగంతో వారి లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, సమర్పించవచ్చు.
  • జీవన్ ప్రమాణ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్ ద్వారా తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించవచ్చు.
  • పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, ట్రెజరీ మొదలైన పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీల కార్యాలయం ద్వారా జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికెట్లను పొందవచ్చు. 
  • దేశంలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్’ ద్వారా కూడా పింఛనుదారులు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఈ సేవ 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు లేదా వారి సర్టిఫికేట్‌లను సమర్పించడంలో వారికి సహాయపడటానికి మొబిలిటీ సమస్యలు ఉన్న వారికి అందుబాటులో ఉంది.
  • ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి వారి సర్టిఫికేట్‌లను సమర్పించడానికి పెన్షనర్లు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం గూగుల్‌ప్లే స్టోర్‌, జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికెట్‌ పొందవచ్చు. 
  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ‘డోర్‌స్టెప్ సర్వీస్ ఫర్ సబ్‌మిషన్ ఆఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ బై పోస్ట్‌మ్యాన్’ సేవ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌లను కూడా సమర్పించవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్ నుంచి “పోస్ట్‌ ఇన్‌ఫో యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఈ సేవను ఉపయోగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..