AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్‌ నుంచి వలస వెళ్లిపోతున్న బిలియనీర్లు! కారణం ఏంటి? ఏ దేశానికి వెళ్తున్నారంటే..?

ప్రపంచంలోని ధనవంతులు, లక్ష్మీ మిట్టల్ వంటి భారతీయ సంతతి బిలియనీర్లు బ్రిటన్ నుండి దుబాయ్‌కి వలస వెళ్తున్నారు. బ్రిటన్‌లో పెరుగుతున్న అధిక పన్నులు, ముఖ్యంగా 40 శాతం వారసత్వ పన్ను, వారికి భారంగా మారాయి. దుబాయ్ వారసత్వ పన్ను లేని స్వర్గధామంగా మారడంతో, సంపన్నులు తమ ఆస్తులను కాపాడుకోవడానికి అక్కడికి తరలిపోతున్నారు.

బ్రిటన్‌ నుంచి వలస వెళ్లిపోతున్న బిలియనీర్లు! కారణం ఏంటి? ఏ దేశానికి వెళ్తున్నారంటే..?
Billionaires Leaving Uk
SN Pasha
|

Updated on: Nov 26, 2025 | 10:00 AM

Share

ప్రపంచంలోని అత్యంత ధనవంతులు బ్రిటన్‌ వదిలి వలస వెళ్తున్నారు. వారిలో ఎక్కువ మంది దుబాయ్‌లో స్థిరపడుతున్నారు. ఇలా బ్రిటన్‌ నుంచి దుబాయ్‌కి వలస వెళ్తున్న బిలియనీర్ల లిస్ట్‌లో భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ పేరు కూడా చేరింది. మిట్టల్ బ్రిటన్‌ను వదిలి దుబాయ్‌లో స్థిరపడటానికి సిద్ధమవుతున్నారు. మిట్టల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలర్ మిట్టల్‌ను కలిగి ఉన్నారు. బ్రిటన్‌లోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు. అయితే ఇప్పుడు ఆయన బ్రిటన్‌ వదిలి దుబాయ్‌కి ఎందుకు వలస వెళ్తున్నారనేదే అసలు ప్రశ్న. ఆయనతో చాలా మంది బిలియనీర్లు కూడా అలాగే వెళ్లిపోతున్నారు. వారికి సేమ్‌ ప్రాబ్లమ్‌ అదే.. అధిక పన్నులు.

నిజానికి బ్రిటన్ కొత్త లేబర్ ప్రభుత్వం అతి ధనవంతులపై సంపద పన్నులను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల నుండి సుమారు 20 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.2.3 లక్షల కోట్లు) సేకరించడం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ ప్రతిపాదిత పన్ను పెంపు సంపన్న వ్యాపార యజమానులను అభద్రతా భావానికి గురిచేసింది.

అంతేకాకుండా ప్రభుత్వం ఏప్రిల్ 2025 నుండి మూలధన లాభాల పన్నును 10 శాతం నుండి 14 శాతానికి పెంచింది. 2026లో దానిని 18 శాతానికి పెంచాలని యోచిస్తోంది. అయితే సంపన్నులకు అతిపెద్ద ఆందోళన వారసత్వ పన్ను ఇది UKలో 40 శాతం వరకు ఉంది. దీని అర్థం వారి ప్రపంచ ఆస్తులు కూడా ఈ భారీ పన్నుకు లోబడి ఉండవచ్చు. ఇదే సమయంలో దుబాయ్ ఆకర్షణ ఉంది, ఇక్కడ ఈ వారసత్వ పన్ను సున్నా. అందుకే చాలా మంది దుబాయ్‌లో స్థిరపడాలని చూస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us