Exchange Offer: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, భారతదేశంలో ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారం పెరుగుతున్నందున, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మార్పిడి చేయడం సులభం అలాగే లాభదాయకంగా మారింది..

శ్రావ్య ఐఫోన్ 14ని కొనాలనుకుంటోంది. ఈ ఫోన్ ఇ-కామర్స్ సైట్‌లో 25,000 రూపాయల తగ్గింపుతో అందుబాటులో ఉందని న్యూస్ పేపర్ లో యాడ్ చూసింది. 25,000 రూపాయల రాయితీని చూడగానే ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. మొత్తం యాడ్ చదివిన తర్వాత, క్రెడిట్ కార్డ్ పేమెంట్‌పై లభించే 25,000 రూపాయల తగ్గింపులో పాత ఫోన్‌లకు 20,000 రూపాయల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉందని ఆమె గుర్తించింది. వెంటనే శ్రావ్య ఈ న్యూస్ ను పక్కన పెట్టేసింది.
శ్రావ్య లానే, మీరు కూడా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం భారీ మారకం ధర గురించి ఆందోళన చెందుతూ, కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి మీ పాత AC-TV-ఫ్రిడ్జ్ మొదలైనవాటిని మార్చుకోవాలనుకుంటే అలా చేయడానికి ముందు ఈ వివరాలు తెలుసుకోండి.
పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, భారతదేశంలో ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారం పెరుగుతున్నందున, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మార్పిడి చేయడం సులభం అలాగే లాభదాయకంగా మారింది. ఉదాహరణకు.. మీరు 17,000 రూపాయల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీరు మీ 1-2 సంవత్సరాల పాత ఫోన్‌ని Flipkart లేదా Amazonలో మార్చుకోవచ్చు. అలాంటప్పుడు మీరు 10,000 రూపాయల వరకు పొందవచ్చు. ఈ విధంగా మీరు పాతఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకున్నట్లయితే కొత్త ఫోన్ కేవలం 7,000 రూపాయలకే పొందవచ్చు. అదేవిధంగా మీరు మీ పాత టీవీని కూడా కొత్తదానికి మార్చుకోవచ్చు.




ఇ-కామర్స్ సైట్‌లతో పాటు, స్థానిక ఎలక్ట్రానిక్ ఉపకరణాల షాప్‌లు, ఇతర స్టోర్‌లలో కూడా ఎక్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తాయి. ఇక్కడ మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు, మరెన్నో ప్రొడక్టులను మార్చుకోవచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌ల కంపెనీలు తమ సైట్‌లో ఎక్ఛేంజ్ సౌకర్యాలను కూడా అందిస్తాయి. ఈ కంపెనీల పాత ప్రొడక్ట్స్ ను వారి సైట్‌లో ఎక్ఛేంజ్ చేసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు తమ పాత ఉత్పత్తులకు ఎక్కువ విలువను అందిస్తారు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఎక్కడ నుంచి ఈ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మంచిది అనేది. స్థానిక షాప్స్, ఇ-కామర్స్ సైట్‌లు రెండూ వేటికి వాటికి వాటి వాటి లాభాలు, నష్టాలూ రెండూ ఉంటాయి. ఆన్‌లైన్ మార్పిడికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా, మీరు కొత్త ప్రొడక్ట్ పూర్తి ధరను చెల్లించలేకపోతే, మీరు దానిని EMIగా కూడా మార్చవచ్చు. మరోవైపు, మీరు స్థానిక షాప్స్ లోనూ ధరను బేరం చేయవచ్చు.
ఇప్పుడు, ఎక్ఛేంజ్ మీకు ప్రయోజనకరంగా ఉందా లేదా అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం స్పష్టం.. మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అప్‌డేట్‌గా ఉండాలని కోరుకుంటారు. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్‌ల వంటి గృహోపకరణాల వరకు కంపెనీలు ప్రతిరోజూ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం మన పాత వస్తువులను ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త వస్తువులకు అప్ గ్రేడ్ చేసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




