Haleem: హైదరాబాద్‌లో నోరూరిస్తున్న హలీమ్‌.. దీనికి 400 ఏళ్ల చరిత్ర.. ప్రయోజనాలు ఏంటో తెలిస్తే తినకుండా ఉండలేరు

రంజాన్‌ సీజన్‌లో ఏ గల్లీలో వెళ్లినా ఘుమఘుమలు గుబాళిస్తూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన పరిమళం అలా నాసికను తాకుతూ ఉంటుంది. సాయంత్రం ఐదున్నర అయిందంటే ఇరానీ హోటల్స్‌ దగ్గర సందడి సంతరించుకుంటుంది..

Haleem: హైదరాబాద్‌లో నోరూరిస్తున్న హలీమ్‌.. దీనికి 400 ఏళ్ల చరిత్ర.. ప్రయోజనాలు ఏంటో తెలిస్తే తినకుండా ఉండలేరు
Haleem
Follow us
Subhash Goud

|

Updated on: Apr 15, 2023 | 6:15 PM

రంజాన్‌ సీజన్‌లో ఏ గల్లీలో వెళ్లినా ఘుమఘుమలు గుబాళిస్తూ ఉంటాయి. ఒక ప్రత్యేకమైన పరిమళం అలా నాసికను తాకుతూ ఉంటుంది. సాయంత్రం ఐదున్నర అయిందంటే ఇరానీ హోటల్స్‌ దగ్గర సందడి సంతరించుకుంటుంది. ఈ పాటికి అర్థమై ఉంటుంది మేము దేని గురించి చెప్తున్నామో. ఎస్‌. మీరు ఊహించింది కరెక్టే. మేము చెప్తున్నది హలీమ్‌ గురించే. రంజాన్‌ వచ్చిందంటే చాలూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా నోరూరించే హలీమ్‌ సిద్ధంగా ఉంటుంది. ఉపవాసం ఉండే ముస్లింలే కాదు ఇతరులు కూడా చాలా ఇష్టంగా హాలీమ్‌ తింటారు. అద్భుతమైన రుచితో కూడిన హలీమ్‌లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నిజానికి హలీమ్‌ను ఒక కంప్లీట్‌ హెల్తీ మీల్‌గా చెప్పవచ్చు. హైదరాబాదీ హలీమ్‌కు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్ స్టేటస్‌ కూడా ఉంది.

హైదరాబాద్‌ బిర్యానీ తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన వంటకం హలీమ్‌. వాస్తవానికి హలీమ్‌ అన్నది అరబిక్‌ వంటకమైనా హైదరాబాద్‌ హలీమ్‌కు వల్డ్‌వైడ్‌ క్రేజ్‌ ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే హలీమ్‌ రాజధాని మన హైదరాబాద్‌. ఇన్‌స్టంట్‌ ఎనర్జీ అందించే హై-క్యాలరీ డిష్‌. ఈ హలీమ్‌కు దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అరబ్బులు, పర్షియన్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చింది ఈ హలీమ్‌ వంటకం.

మందపాటి పాత్రల్లో గంటలపాటు మాంసాన్ని ఉడికించడం హలీమ్‌కు ఉన్న మొదటి స్పెషాలిటీ. ఇండియాలో మాత్రమే దొరికే స్పైసెస్‌ ఇందులో యాడ్‌ చేస్తారు కాబట్టి హైదరాబాద్‌ హలీమ్‌కు ప్రత్యేక రుచి. అయితే వండే విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. తెలంగాణ వంటకాల్లో విపరీతంగా ఉపయోగించే చింతపండు, కారం లేకపోవడం హలీమ్‌కు ఉన్న మరో స్పెషాలిటీ.

ప్రొటిన్స్‌, ఫైబర్‌తో కూడిన హలీమ్‌ ఒక కంప్లీట్‌ హెల్తీ మీల్‌ అని చెప్తారు డెటిషియన్స్‌. ఇందులో అధికంగా ఉండే ఐరన్‌ కంటెంట్‌ ఎనిమియాతో బాధపడుతున్న రోగులకు ఎంతో మేలు చేస్తుంది. రంజాన్‌ మాసంలో నమాజ్‌ వదిలిన పెట్టిన వెంటనే చాలా మంది ఇష్టంగా తినే వంటకంగా హలీమ్‌కు పేరుంది. ఇందులో కేలరీలు అధికంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మటన్, డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం.

హలీమ్‌ కేవలం డెలిషియస్‌ డిష్‌ మాత్రమే కాదు ఇది సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబం కూడా. అరబ్‌ వంటకం హరీస్‌ నుంచి హలీమ్‌ వచ్చినట్టు చరిత్ర చెప్తోంది. అరబ్‌ దేశాల్లో 10వ శతాబ్దంలోనే హరీస్‌ చాలా పాపులర్‌. హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన అరబ్బులు, పర్షియన్ల నుంచి ఇది నిజామ్‌ రాజ్యానికి వచ్చింది.

హలీమ్‌ తయారీలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. గోధుమలు, బార్లీతో చేసే హలీమ్‌ ఒకటైతే, పప్పులతో చేసేది మరొకటి. హలీమ్‌ అంటేనే మాంసపు వంటకం. కొలెస్టరల్‌ గురించి ఆందోళన చెందే వారికి కోసం ఇప్పుడు చికెన్‌ హలీమ్‌ కూడా అందుబాటులో ఉంది. శాకాహారులకు ఇప్పుడు వెజిటెబుల్‌ హలీమ్‌ కూడా దొరుకుతోంది.

రాజుల విందులు, వివాహ వేడుకలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనిపించే హలీమ్‌ను మొట్టమొదటిసారి 1953లో మదీనా హోటల్‌లో విక్రయించారు. అప్పట్లో దాని ధర 3 పైసలు. ఆ తర్వాత క్రమంగా అది హైదరాబాద్‌లోని ఇరానీ హోటల్స్‌ అన్నింటికీ విస్తరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...