TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. ఆ విషయం బయటకు రావొద్దని తిరుపతి, షిర్డీ టూర్.. సిట్ విచారణలో సంచలన విషయాలు
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఖమ్మంకు చెందిన దంపతులు ఏప్రిల్ ఏడో తేదీన అరెస్టు చేసిన సిట్ అధికారులు.. లౌకిక్, సుస్మితలను మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న పలు ప్రశ్నలు సంధించిన సిట్..

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఖమ్మంకు చెందిన దంపతులు ఏప్రిల్ ఏడో తేదీన అరెస్టు చేసిన సిట్ అధికారులు.. లౌకిక్, సుస్మితలను మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న పలు ప్రశ్నలు సంధించిన సిట్ అధికారులు, రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇద్దరిని తీసుకొని ఖమ్మం వెళ్లారు సిట్ అధికారులు. సుస్మిత, లౌకిక్ ఇంట్లో సోదాలు చేయనున్నారు.
పేపర్ లీక్ కేసులో మొదటిరోజు లౌకిక్, సుస్మితలను విచారించిన సిట్ అధికారులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. డీఏవో ఉద్యోగం ఖరారైనట్లే అనుకుంటున్న సమయంలో గ్రూప్ 1 పేపర్‌లీక్ విషయం బయటకు రావడంతో లౌకిక్, సుస్మిత ఆందోళనకు గురయ్యారు. అధికారుల విచారణ గ్రూప్ 1 తోనే ఆగిపోవాలని, డీఏవో విషయం బయటపడకూడదని దేవుళ్లను మొక్కుకున్నారని తెలిసింది. అంతేకాదు భయంతో వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగారట. తిరుపతి, షిర్డీలో రోజుల తరబడి ఉన్నారని విచారణలో తేలింది.
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కావడంతో.. సుస్మిత దరఖాస్తు చేసుకుంది. గతేడాది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా రాంగ్ బబ్లింగ్‌తో డిస్ క్వాలిఫై అయ్యింది. ఈ విషయంలో అనేకసార్లు ఆమె టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలోనే పేపర్ లీక్ ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో సుస్మితకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పేపర్‌ను ప్రవీణ్ అమ్మకానికి పెట్టడంతో 10 లక్షలకు బేరం పెట్టాడు. చివరకు లౌకిక్ 6 లక్షలు చెల్లించి ప్రవీణ్‌తో పేపర్ తీసుకొని సుస్మితకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. లీక్ అయిన పేపర్‌తో ప్రిపేర్ అయిన సుస్మిత అన్ని ప్రశ్నలకు జవాబులు మార్క్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో DAO పోస్ట్ గ్యారంటీ అనే సంతోషంలో భార్యభర్తలు ఉన్నారు. 25 రోజుల తర్వాత డీఏవో పేపర్ లీక్ మ్యాటర్ బయటపడింది. అయితే వీళ్లిద్దరి నుంచి ఇతరులకు పేపర్ చేరిందా అని సిట్ ఆరా తీస్తోంది. ప్రవీణ్‌తో ఉన్న పరిచయం, ఆర్థిక లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
