Hyderabad RTC: హైదరాబాద్‌లో డీజిల్ బస్సులకు ఆర్టీసీ గుడ్‌బై.. ఇక వచ్చేవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే..
హైదరాబాద్ సిటీలో ప్రజారవాణా వ్యవస్థ రూపు మారబోతోంది. కాలుష్యం వెదజల్లే డీజిల్ బస్సులు ఇక స్వస్తి చెప్పనుంది తెలంగాణ ఆర్టీసీ. దశలవారీగా డీజిల్ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది టీఎస్ ఆర్టీసీ.
Updated on: Apr 15, 2023 | 12:40 PM

హైదరాబాద్ సిటీలో ప్రజారవాణా వ్యవస్థ రూపు మారబోతోంది. కాలుష్యం వెదజల్లే డీజిల్ బస్సులు ఇక స్వస్తి చెప్పనుంది తెలంగాణ ఆర్టీసీ.

దశలవారీగా డీజిల్ బస్సులను పక్కన పెట్టి ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది టీఎస్ ఆర్టీసీ.

ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ఉన్న 2,850 బస్సులు స్థానంలో 2027 నాటికి మొత్తం 3300 ఎలక్ట్రిక్ సిటీ బస్సులు రానున్నాయి.

దేశ రాజధాని దిల్లీలో, దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో డీజిల్ వాహనాలు అస్సలు కనిపించవు. ముందుగా అక్కడ ప్రజారవాణా వాహనాలను సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ చేశాక.. ప్రైవేటు వాహనాలను సైతం ఆగేలా ఉండేలా అక్కడి ప్రభుత్వాలు మార్చుతున్నాయి.

హైదరాబాద్‌లోనూ ఈ దిశగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు.. ఎలక్ట్రిక్ సిటీ బస్సులను ప్రభుత్వం సమకూర్చుతుంది.

ప్రస్తుతం 2,850 బస్సులు నగరంలో దాదాపు 8 లక్షల కిలోమీటర్ల వరకూ తిరుగుతున్నాయి. తద్వారా రోజుకు ఆర్టీసీకి రూ.4 కోట్లు ఆదాయం వస్తే రూ.4.75 కోట్లు ఖర్చు అవుతుంది.

అదే ఎలక్ట్రిక్ బస్సులైతే ఆర్టీసీ గ్రేటర్ జోన్‌కు ఇంధన పొదుపు ద్వారా రూ. 1.36 కోట్లు మిగులుతుంది.




