AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Hack: మీ మొబైల్ హ్యాక్ అయిందో.. లేదో.. తెలుసుకోండిలా..

మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు చెక్ చేసే కోడ్స్, అనుసరించాల్సిన పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా గుర్తించవలసిన లక్షణాలలో ఫోన్ ఆకస్మాత్తుగా ఎక్కువగా హీటెక్కడం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

Mobile Hack: మీ మొబైల్ హ్యాక్ అయిందో.. లేదో.. తెలుసుకోండిలా..
Sravan Kumar B
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 30, 2025 | 1:09 PM

Share

మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు చెక్ చేసే కోడ్స్, అనుసరించాల్సిన పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా గుర్తించవలసిన లక్షణాలలో ఫోన్ ఆకస్మాత్తుగా ఎక్కువగా హీటెక్కడం, బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవడం. ఫోన్ రీస్టార్ట్/షట్‌డౌన్ ఆటోమేటిక్‌గా జరగడం. ఇంటర్నెట్ డేటా వినియోగం అనూహ్యంగా పెరగడం.స్లో పనితనం, తరచుగా ఫోన్ స్ట్రక్ అవ్వడం లేదా క్రాష్ అవ్వడం. ఫోన్‌లో అనవసరమైన యాప్లు కనిపించడం.పాపప్ అడ్స్ ఎక్కువగా రావడం. కాల్ లాగ్‌లో పరిచయం లేని నంబర్ల నుండి వచ్చిన మెసేజ్‌లు, కాల్స్ కనిపించడం. ఫోన్ సెట్టింగ్స్/ప్రైవసీలో అనుమానాస్పద మార్పులు కనిపించడం.

అయితే మీ ఫోన్ కు సంబంధించిన కొన్ని విషయాలను చెక్ చేయడానికి స్పెషల్ USSD కోడ్‌లు ఉంటాయి.

IMEI తెలుసుకోవడానికి: *#06# ( ఫోను IMEI గుర్తించండి)

.కాల్ ‌ఫార్వర్డ్‌ చెక్ చేయడానికి: *#21#, *#62#, *#67#, *#004#.

Android నెట్‌వర్క్/టెస్టింగ్ చెక్: ##4636##.

IPhone Field Test Mode: 3001#12345#.

అన్ని ఫార్వర్డ్/రెడైరెక్ట్ ఆఫ్‌ చేయడానికి ##002#.

ఏదైనా అనుమానాస్పద యాప్ కనిపిస్తే డిలీట్ చేయండి.కాల్ లాగ్, డేటా వినియోగాన్ని తరచుగా పరిశీలించండి.అవసరం అయితే ఫ్యాక్టరీ రీసెట్ చేయండి (డేటా బ్యాకప్ లేకుండా). ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్/iOS అప్‌డేట్, సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇన్‌స్టాల్ చేయండి. భద్రత కోసం స్ట్రాంగ్ పాస్‌వర్డ్, 2-factor authentication వాడండి.బయట APKs/third-party apps డౌన్ లోడ్ చేయకండి.Antivirus, anti-spyware tools ఉపయోగించండి.

మీ మొబైల్‌ను హ్యాకింగ్ నుంచి కాపాడడానికి కొన్ని అధునాతన భద్రతా చిట్కాలు ఫాలో అవ్వాలి.ఇవి మీ డేటా, ప్రైవసీ రక్షణకు చాలా ముఖ్యం.ముఖ్యమైన భద్రతా పద్ధతులుఫోన్‌లో స్ట్రాంగ్ పాస్‌వర్డ్,పిన్,ఫేస్ ఐడీ,ఫింగర్‌ప్రింట్‌ లాక్ ఉండాలి.అన్ని యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ తరచుగా అప్డేట్ చేయండి. ఇలా చేస్తే సెక్యూరిటీ డిఫెక్ట్స్ ఫిక్స్ అవుతాయి.భద్రతా యాప్‌లు (Antivirus, Anti-spyware) ఇన్‌స్టాల్ చేసి, తరచుగా స్కాన్ చేయండి. అనవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయవద్దు.

Two-factor authentication అన్ని ముఖ్యమైన అకౌంట్లకూ anble చేయండి.Public WiFi, Charging stations వాడే ముందు జాగ్రత్త వహించండి.తప్పనిసరి అయితే VPN ఉపయోగించండి.ఏ యాప్, సర్వీస్ అనవసరమైన permissions అడిగితే deny చెయ్యండి. Privacy settings తరచూ చెక్ చేయండి. బ్లూటూత్, NFC అవసరం కానప్పుడు ఆఫ్ చేయండి. డేటా బ్యాకప్ రెగ్యులర్‌గా తీసుకుంటే, హ్యాక్ లేదా లాస్ జరిగినా restore చేసుకోవచ్చు. cache, browser history, cookies తరచూ క్లియర్ చేయండి. అదనపు advanced stepsDevice storage Encrypt చేయడం; iPhoneలో Data Protection ఆన్ చేయండి, Androidలో encryption ఆప్షన్ పొందండి. SIM Card Lock చేయండి. ప్లాట్‌ఫార్మ్ ఇంటర్నల్ సెట్టింగ్స్‌లో ఆప్షన్ ఉంటుంది. ఫోన్‌లో Developer Options/Unnecessary features off చేయండి. ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వడం వల్ల హ్యాకింగ్‌ ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు.