Kawasaki Eliminator Cruiser: సూపర్ ఉందిగా కవాసకి న్యూ బైక్.. బ్లాక్ టాపింగ్‌తో అదరగొడుతోంది.. ధర ఎంతో తెలుసా..
ఈ బైక్ 286సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేసే హోండా రెబెల్ 300తో పోటీపడుతుంది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.2.30 లక్షలు.
కవాసకి న్యూ బైక్ లాంచ్ చేసింది. తన 2023 ఎలిమినేటర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌ను జపాన్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ బైక్ స్టాండర్డ్, SE వంటి రెండు ట్రిమ్‌లలో తీసుకురాబడింది. ఈ బైక్ భారత మార్కెట్‌లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ బైక్ హోండా రెబెల్ 300కి పోటీగా ఉంటుందని బైక్ ప్రియులు అంచానా వేస్తున్నారు. తాజాగా కవాసకి విడుదల చేిస ఎలిమినేటర్ క్రూయిజర్ డిజైన్ అదిరిపోతోంది.
కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ బైక్ కొత్త వెర్షన్‌లో రెట్రో స్టైలింగ్ అలాగే ఉంచబడింది. ఇది రౌండ్ షేప్‌లో LED హెడ్‌లైట్, భారీ రౌండ్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ పీస్ సీట్ సెటప్, పాక్షికంగా బహిర్గతమయ్యే ఫ్రేమ్‌తో కూడిన క్రూయిజర్ .. ఇంతకుముందు ఎలిమినేటర్‌లో దొరికిన క్రోమ్ వర్క్ ఇందులో ఇవ్వలేదు. మొత్తం బాడీవర్క్, భాగాలకు బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వబడింది. కొత్త ఎలిమినేటర్‌లో ముందు, వెనుక కెమెరాలు ఇవ్వబడ్డాయి. ఇవి డాష్-క్యామ్‌ల వలె ఉపయోగించబడతాయి. ఇది చిన్న బైకింగ్ ఫెయిరింగ్ కూడా ఉపయోగపడుతుంది.
ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త కవాసకి ఎలిమినేటర్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 47bhp, 37Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 398cc సమాంతర-ట్విన్ ఇంజన్ ద్వారా శక్తిని పొందింది. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఇవ్వబడ్డాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్స్‌తో ముందువైపు 310ఎమ్ఎమ్ డిస్క్, వెనుక వైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ డ్యూయల్-ఛానల్ ABSతో ఉంటుంది.
ఈ బైక్ ముందు భాగంలో 18 అంగుళాలు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. మోటార్‌సైకిల్ బరువు 176 కిలోలు, 12-లీటర్ ఇంధన ట్యాంక్, సీటు ఎత్తు 735 మిమీ.
ధర ఎంతంటే..
కొత్త కవాసకి ఎలిమినేటర్ క్రూయిజర్ ప్రారంభ ధర జపాన్‌లో 7,59,000 యెన్ (సుమారు 4.71 లక్షల భారతీయ రూపాయలు)గా ఉంచబడింది. దాని టాప్-స్పెక్ SE వేరియంట్ ధర 8,58,000 యెన్ (సుమారు రూ. 5.33 లక్షలు). మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది.
ఎవరితో పోటీ ..
ఈ బైక్ 286సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేసే హోండా రెబెల్ 300తో పోటీపడుతుంది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.2.30 లక్షలు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం