AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Karizma XMR 250: కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 నయా వెర్షన్ రిలీజ్.. మతిపోగుడుతున్న సరికొత్త ఫీచర్లు

భారతదేశంలో యువత సూపర్ బైక్స్‌పై ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా హీరో కరీజ్మా బైక్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మధ్యతరగతి యువత కూడా కొనుగోలు చేసేలా అందుబాటు ధరలో కరీజ్మా బైక్స్ ఉండడంతో వీటి సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇటీవల మార్కెట్‌లో పెరిగిన పోటీ నేపథ్యంలో హీరో కంపెనీ కరీజ్మా నయా వెర్షన్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా కరీజ్మా ఎక్స్ఎంఆర్ 2025 వెర్షన్ రిలీజ్ చేసింది. కరీజ్మా నయా వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Hero Karizma XMR 250: కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 నయా వెర్షన్ రిలీజ్.. మతిపోగుడుతున్న సరికొత్త ఫీచర్లు
Hero Karizma Xmr 250
Nikhil
|

Updated on: Nov 08, 2024 | 3:40 PM

Share

ఇటీవల ఓ ఈవెంట్‌లో హీరో కంపెనీ ఎక్స్ పల్స్ 2014, కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250ను కూడా రిలీజ్ చేసింది. ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ముఖ్యంగా స్పోర్టీ లుక్ యువతన అమితంగా ఆకర్షిస్తుంది. అధునాతన ఫ్యూయల్ ట్యాంక్, సిట్-సీట్ సెటప్ బైక్‌కు నయా లుక్‌ను ఇస్తుంది. తెలుపు, ఎరుపు రంగుల కలయికతో వచ్చే ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం కౌల్ నలుపు టోన్‌తో ఆకర్షిస్తుంది.  ఎగ్జాస్ట్ సిల్వర్ ట్రిమ్‌తో వచ్చే కరిజ్మా ఎక్స్ఎంఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు బైక్‌కు నయా లుక్‌ను ఇస్తాయి.

కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 డీఓహెచ్‌సీ 250 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 30 హెచ్‌పీ, 25 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ ఇంజిన్‌లో 250 సీసీ మిల్లో స్ట్రోక్ పొడవును 7 ఎంఎం పెంచారు. ఇది ఆరు-స్పీడ్ గేర్బాక్స్‌తో వస్తుంది. ముఖ్యంగా కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 కోసం స్టీల్-ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్ సెటప్‌తో వస్తుంది. 

కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 2025 వెర్షన్‌లో ముందు, వెనుక 17 అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. అలాగే ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. హీరో ఈ 30 హెచ్‌పీ స్పోర్ట్స్ బైక్‌కు అడ్జస్టబుల్ క్లిప్-ఆన్ హ్యాండిలార్బర్లను కూడా ఇస్తుంది. అయితే ఈ ఈవెంట్‌లో భారతదేశంలో కొత్త కరిజ్మా ఎక్స్ టెన్ఆర్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో? హీరో ధృవీకరించలేదు. ముఖ్యంగా సుజుకీ జిక్స్ ఎస్ఎఫ్‌-250కు పోటీనిచ్చేలా హీరో కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 ధరను రూ. 2 లక్షలకే అందుబాటులో ఉంచింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..