Skoda Kylaq: సూపర్ లుక్‌తో స్కోడా కైలాక్.. బుకింగ్‌లు షురూ..!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా నుంచి మరో కొత్త కారు విడుదలైంది. సబ్ 4 మీటర్ల ఎస్ యూవీ విభాగంలో ఆ సంస్థ తొలిసారిగా ఆవిష్కరించిన ఈ కారుకు కైలాక్ అని పేరు పెట్టారు. దీంతో కోడియాక్, కుషాక్, కైలాక్ అనే మూడు ఎస్ యూవీలను స్కోడా కంపెనీ అందించినట్టు అయ్యింది. వీటి ద్వారా దేశంలోని చాలా మంది కస్టమర్ల ఆదరణ పొందింది.

Skoda Kylaq: సూపర్ లుక్‌తో స్కోడా కైలాక్.. బుకింగ్‌లు షురూ..!
Skoda Kylaq
Follow us
Srinu

|

Updated on: Nov 07, 2024 | 8:13 PM

కైలాక్ కారు లుక్ చాలా స్లైలిష్ గా ఉంది. ఆధునిక ఫీచర్లు, నాణ్యమైన ఇంజిన్, ఇతర ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బుక్కింగ్ లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది నుంచి కార్లను డెలివరీలు చేస్తారు. స్కోడా కైలాక్ కారు ఆవిష్కరణతో స్కోడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. సబ్ ఫోర్ మీటర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ) విభాగంలోకి చేరింది. దీని ధర రూ.7.89 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ బ్రెజ్టా, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో తదితర వాటికి పోటీకి నిలుస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

స్కోడా కైలాక్ కారుపై ఆ కంపెనీ సీఈవో క్లాస్ జెల్మెర్ మాట్లాడుతూ తమ కొత్త బ్రాండ్ కు భారత దేశం ఎంట్రీ పాయింట్ గా మారిందన్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్ అయిన ఇండియాలో కొత్త కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు. వీటిలో దాదాపు 50 ఎస్ యూవీలు ఉంటున్నట్టు తెలిపారు. తమ కారుకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నామన్నారు. స్కోడా కైలాక్ కారులో 1.0 లీటర్ పెట్రోలు ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 113 బీహెచ్ పీ శక్తి, 178 టార్కు ను ఉత్పత్తి అవుతుంది. ఆరు స్పీడ్ మాన్యువల్, ఆరు స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్ మిషన్ తో ఇంజిన్ కు జత చేశారు. కేవలం 10.5 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది.

స్కోడా కొత్త కారులో 8 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్ లెస్ ఫోన్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల డ్రైవింగ్ సీట్లు, కాంటన్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆరు ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ట్రాక్సన్ కంట్రోల్, త్రీ పాయింట్ బెల్టులు, ప్రయాణికులందరికీ హెడ్ రెస్టులు తదితర ఫీచర్లు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ కు చెందిన స్కోడా కంపెనీ మన దేశంలో తన కార్ల అమ్మకాలను పెంచుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. 2026 నాటికి పది వేల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌకర్యం, నాణ్యత, బెస్ట్ డిజైన్, భద్రత అనే నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్