Amazon Clinic: అందుబాటులోకి అమెజాన్ సర్వీసెస్.. ఒకే క్లిక్‌లో డాక్టర్ సౌకర్యం.. ఎలాగో తెలుసుకోండి

భారతదేశంలో కొత్త సేవను ప్రారంభించింది అమెజాన్. అమెజాన్ క్లినిక్ సేవ ద్వారా, ప్రజలు 50 కంటే ఎక్కువ వ్యాధులకు సంబంధించిన కన్సల్టెషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Amazon Clinic: అందుబాటులోకి అమెజాన్ సర్వీసెస్.. ఒకే క్లిక్‌లో డాక్టర్ సౌకర్యం.. ఎలాగో తెలుసుకోండి
Amazon Clinic
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 08, 2024 | 2:32 PM

ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ సర్వీస్ ‘అమెజాన్ క్లినిక్’ ను అమెజాన్ భారత దేశంలో ప్రవేశ పెట్టింది. ఈ యాప్ ద్వారా 50కి పైగా వైద్య సమస్యలకు సరసమైన ధరలో ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్లను అందిస్తుంది. వినియోగదారులు అమెజాన్ యాప్ ద్వారా నేరుగా వైద్య నిపుణులతో అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రూ.299తో ప్రారంభమయ్యే ఈ సర్వీసు ప్రస్తుతం ఉన్న ప్రాక్టీ వంటి ఫ్లాట్ ఫార్మ్మ్ ల మాదిరి గానే పని చేస్తుంది.

అమెజాన్ భారతదేశంలో కొత్త సేవను ప్రారంభించింది. అమెజాన్ క్లినిక్ సేవ ద్వారా, ప్రజలు 50 కంటే ఎక్కువ వ్యాధులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా వైద్యులతో సంప్రదింపులు తీసుకోవచ్చు. ప్రస్తుతం, అమెజాన్ క్లినిక్ సేవ Android, iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని డెస్క్‌టాప్‌లో ఉపయోగించలేరు. సంప్రదింపులను బుక్ చేసుకునే ముందు, మీ పేరు, వయస్సు, జెండర్, ఫోన్ నంబర్‌ను అందించాలి. ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. అ తర్వాత డాక్టర్ నుండి ఆన్‌లైన్ సంప్రదింపులు పొందే సదుపాయాన్ని పొందుతారు. అసరమైతే, క్లినిక్‌కి వెళ్లి వైద్యుడిని కలవవచ్చు. అయితే క్లినిక్‌లో వైద్యుడిని కలిసే సౌకర్యం అన్ని చోట్లా లేదు.

అమెజాన్ క్లినిక్‌లో డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ కౌన్సెలింగ్ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారు. క్లినిక్‌లో జాబితాలోని వైద్య నిపుణులందరికీ టెలి-కన్సల్టేషన్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉంటుందని అమెజాన్ తెలిపింది. ఇది కాకుండా, ఈ సంప్రదింపులకు సంబంధించిన అన్ని వైద్య రికార్డులు సురక్షితంగా ఉంచామని వెల్లడించింది. దీనికి రుసుము రూ. 299 నుండి రూ. 799 మధ్య ఉంటుంది. వర్చువల్ కన్సల్టేషన్‌లో ఏడు రోజుల పాటు ఉచిత ఫాలో-అప్ కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌లో ఫార్మసీ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మీరు యాప్‌లోనే మందులను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..